Tollywood news in telugu

Check Movie Review: చెక్ మూవీ రివ్యూ.. మొదటి షో చూసిన వారి కామెంట్స్ ఇలా ఉన్నాయ్..!

Check Movie Review

Check Movie Twitter Review: హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘చెక్’ ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి రూపొందించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  ‘చెక్’ మూవీ   ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఫిబ్రవరి 26న  విడుదలైంది. ఇందులో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ఆదేవిందంగా  ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.

 ఇవాళ ప్రేక్షకుల ముందు కు వచ్చిన ‘చెక్’ మూవీ ఫస్ట్ షో నుంచే మంచి టాక్ ను అందుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నితిన్ కి అతని ఫాన్స్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ సపోర్ట్ ఉండనే ఉంది. ఇక సినిమా చుసిన , చూస్తున్న ప్రేక్షకులు షోషల్ మీడియా ద్వారా ఏమంటున్నారో చూద్దాం…

ముందుగా కోర్టు జడ్జిమెంట్‌ సీన్‌తో స్టార్ట్ ఐన  ఫస్ట్ హాఫ్ పలు ఇంట్రెస్టింగ్ మలుపులతో అద్భుతంగా సాగుతుందని అంటున్నారు. కొన్ని చోట్ల బోరింగ్ కలిగించిన వెంటనే మల్లి సినిమా మూడ్ లోకి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. సంగీతం చాల బాగుందని ,  లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఇరగదీసిందని, ఇంకా  ప్రియా ప్రకాష్ వారియర్ కూడా సినిమాలో ముఖ్య భూమిక పోషించి మెప్పించింది అని ప్రేక్షకులు అంటున్నారు. 

Read  అందాల అనసూయా....

ఇక ముఖ్యంగా ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రధాన హైలైట్ అని.. నితిన్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుతున్నాయి.  ఓవరాల్‌గా సినిమా హిట్ అని , మంచి కలెక్షన్లను తెచుకుంటుందని భావిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button