నడిరోడ్డుపై పంగనామాలు పెడుతున్న అమ్మాయిలు…!

హైదరాబాద్ రోడ్డుపై అమ్మాయిలు వఛ్చిపోయేవారికి పంగనామాలు పెడుతున్నారు. ఘట్కేసర్ రోడ్డు పక్కన నిలుచొని వాహనాలు ఆపిమరీ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మోడల్ గా తయారయ్యి , కొందరు అమ్మాయిలు స్వచ్ఛంద సంస్థ పేరు తో వసూళ్లు చేస్తున్నారు.
ఇలా నలుగురు అమ్మాయిలు రోడ్డుపై ఉండి వసూల్ చేయడంతో , కొందరు స్వచ్చంద సంస్థకే కదా అని డబ్బులు ఇస్తే, ఇంకొందరు లైట్ గా తీసుకొని వెళ్లిపోతున్నారు.
ఇలా రోడ్డు పై డబ్బులు వసూలు కు పాల్పడుతున్న అమ్మాయిలను కొంతమంది అటుగా వెళ్లేవారు…ఏ సంస్థ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని అడుగగా… నిర్లక్షంగా సమాధానం ఇస్తూ .. వసూళ్లకు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిని కాస్త గట్టిగానే దబాయిస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారితో గొడవలకు కూడా దిగడంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడిచెరుకొని ఆ అమ్మాయిల్ని దర్యాప్తు చేస్తున్నారు.