telugu gods devotional information in telugu
కార్తీక చతుర్దశి యొక్క విశిష్టత
కార్తీక శుద్ధ చతుర్దశి యొక్క విశిష్టత
కార్తీక మాసం లోని ఈ చతుర్దశి తిధి ని వైకుంఠ చతుర్దశి అంటారు.కార్తీక మాసం ప్రతిరోజు ఏదో ఒక విశిష్టతను కలిగి ఉండే ఏకైక మాసం.అలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది.హరిహరుల ఆరాధన ప్రతి రోజు చేయాల్సిన రోజు.శ్రీ మహావిష్ణువు ని తులసి దళాలచేత , శివుణ్ణి తుమ్మి పూలు, మారేడు పత్రాలచేత పూజించాలి. లోకాలన్ని పూజించే మహా విష్ణువు ఈరోజు కైలాసం పోయి మహాదేవున్ని పూజించే అపురూపమైన రోజు. అలాంటి పుణ్యప్రదమైన రోజు ఎలాంటి పుణ్యం చేసినా కూడా మీకు అనంత ఫలితం లభిస్తుంది
నిజానికి హరిహరులు వేరువేరుగా చూసినా , కనిపించినా కూడా నిజానికి వాళ్లు పరమాత్మ యొక్క అవిభక్త స్వరూపాలే. ఈరోజు ఈ ఇద్దరిలో ఎవరి ఆరాధన చేసినా కూడా ఇరువురి అనుగ్రహము కలుగుతుంది.
ఓమ్ నమః శివాయ
ఓమ్ నమో నారాయణాయ.