Chandramukhi 2 is all set to start shoot : అక్టోబర్ నుంచి చంద్రముఖి 2 షూట్ షురూ :-

Chandramukhi 2 is all set to start shoot : మనందరికీ తెలుసు లాక్ డౌన్ ముందు రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 సినిమా లో లీడ్ గా చేస్తున్నారని. అయితే అప్పటినుంచి , ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబందించిన ఎటువంటి వార్త రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత ఇపుడు ఈ సినిమా గురించి ఎక్సక్లూజివ్ వార్త వచ్చింది.
అదేంటంటే పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చంద్రముఖి 2 సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది అని తెల్సింది. దీనితోపాటు ఈ సినిమాలో రాఘవ లారెన్స్ సరసన అనుష్క శెట్టి చేస్తుందని తెల్సింది. రాఘవ లారెన్స్ రాజు గా కనిపించబోతున్నారు.
చంద్రముఖి 1 లో రా రా అనే పాట లో రజిని రాజు లా వచ్చిన సన్నివేశం ఉంది కదా.. ఆ రాజు లాగా ఇపుడు మనకు రాఘవ లారెన్స్ కనిపించబోతున్నారు. రాఘవ సరసన అనుష్క కనిపించి ప్రేక్షకులని భయబ్రాంతులని చేయడానికి సిద్ధం అయింది.
గతంలో అనుష్క అరుంధతి , భాగమతి అనే సినిమా ద్వారా ప్రేక్షకులని అలరించిన విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో రాఘవ సరసన అనుష్కనే పర్ఫెక్ట్ అని చిత్రబృందం భావించే అనుష్కని అప్రోచ్ అయ్యారని తెలిసింది.
ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మించగా పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. చూడాలి మరి రాఘవ మరియు అనుష్క కలిసి చంద్రముఖి ని మించి పెర్ఫార్మన్స్ తో ఎలా అలరించబోతున్నారో.