చిరంజీవి అలా చేసిన నేనెమనలేదు
ఇటీవలే జరిగిన మీటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి మీద సంచలన వాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
అయితే ఆంధ్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మొదలైన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చివరికి వచ్చేసరికి ఎన్నో సంచలన వాఖ్యలు చేయడంతో పూర్తయింది.
ఈ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గారిని , వారి పార్టీ సభ్యలని పరోక్షంగా అనేకరాకమైన సూటిపోటి మాటలతో మరియు ప్రజలకు కోడి కత్తి గురించి , బాబాయ్ హత్య గురించి , అక్రమ ఆస్తుల గురించి , బాబు పైన ఆరోపణలు చేసిన అందరిని ఒక్కమాటలో కడిగి పాడేశరు. ఇప్పటికీ బాబు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవని అపోజిషన్ వారిని మీటింగ్ లో అందరూ హేళన చేస్తున్నారు.
అయితే వీటన్నిటి మధ్య చంద్రబాబు నాయుడు గారు మెగాస్టార్ చిరంజీవి మీద కూడా కొని వాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే ఇండస్ట్రీ వారు కూడా మేము అధికారంలో ఉన్నపుడు చిన్నచూపు చూశారు. మేము అధికారంలో ఉన్నపుడే మా మీద వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు.
చిరంజీవి నాకు పోటీగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికి నేను ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ఆయన ఎప్పుడూ నాకు వెల్ విషర్. అప్పుడు, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఎటువంటి బేధాలు లేకుండా మాట్లాడుతామని బాబు గారు చెప్పకనే ఇండస్ట్రీ గురించి మరియు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పారు.
బాబు గారి మాటలలో ఎన్ని ద్వంద అర్ధాలు ఉన్నాయో తెలియదు కానీ బాబు గారు మాత్రం అపోజిషన్ పార్టీ వారిని సూటిపోటి మాటలతో కడిగిపాడేశారు.