Tollywood news in telugu

నా చైతు నదికి వెళ్ళడoడి అంటున్న సమంతా

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో, అందంతో అందరిని మాయ చేసిన అందాల భామ సమంత. సమంత, నాగచైతన్య ని వివాహం చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యిoది. అయినప్పటికీ తన సినీ కెరీర్ ని మాత్రం అలాగే కొనసాగిస్తూ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్‌ హిట్‌లతో ఈ ఏడాది ప్రథమార్దం సమంతకు బాగా కలిసి వచ్చింది. ఈ ఇయర్ ద్వితీయార్దంలో కూడా మంచి మూవీస్ తో మన ముందుకు రాబోతుంది ఈ అక్కినేని కోడలు. టాలీవుడ్‌లో చై మరియు సామ్ ఈ జనరేషన్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్.  త్వరలో పెళ్లి తరువాత వీరిద్దరూ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం వీరు ఎవరి కెరీర్ లో వారు తమ సినిమాలు చేసుకుంటూ  చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. తాజాగా చై మరియు సమంత ఇద్దరు సెప్టెంబర్ 13న ఒకే రోజు వినాయక చవితి సందర్భంగా తమ తమ సినిమాలను రిలీజ్ చేసారు. శైలజారెడ్డి అల్లుడు తో చై మరియు u turn తో సమంతా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు చిత్రాలు తొలి రోజు నుంచే విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. సమంతా తన u turn రిలీజ్ సందర్భంగా సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చై కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని కూడా తెలిపి తనకి చై అంటే ఎంత ప్రేమో తెలియజేసింది. ఇది ఇలా ఉంటే బుల్లితెరపై అలీ వ్యాఖ్యాతగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read  అందాల అనసూయా....

అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఒక స్టార్ కమెడియన్ స్థాయికి ఎదిగాడు. అలీ ఇండస్ట్రీలో ఉన్న అందరితోను కొంచెం చనువుగా ఉండడం అందరికి తెలిసిన విషయమే. కెమెరా ముందు అతను వేసే కొన్ని కుళ్లు జోకులు, గలీజు ప్రశ్నలతో ఇప్పటికే పలుమార్లు విమర్శలకు కూడా గురయ్యారు. తాజాగా సమంతాతో జరిగిన కార్యక్రమంలో కూడా అలీ కొన్ని చిలిపి ప్రశ్నలను అడిగారు. దానికి సామ్ కూడా సరదాగా బదులిచ్చారు. ఇంట్లో నాగ చైతన్యని మీరు ఏమని పిలుస్తారు అని అడగ్గా సమంత సిగ్గుపడుతూ ‘బేబీ’ అని పిలుస్తానని సమాధానమిచ్చారు. అలీ అత్తారింటికి దారేదిలోని ‘స్వామి నదికి పోలేదా?’ అనే ఎపిసోడ్‌ను గుర్తుచేయగా పవన్-సమంత-బ్రహ్మానందం మధ్య జరిగిన కామెడీ సీన్స్ లోని ఎక్స్ప్రెషన్స్ ని సమంతా ఈ సందర్భంగా చేసి చూపించారు. మరి నాగ చైతన్య నదికి పోలేదా అని అలీ అడుగగా తన చైతూ నదికి వెళ్లడని, తన వద్దే ఉంటాడని చెబుతూ ‘అలీ గారు మీరు చాలా డేంజరండి’ అని సమంత చెప్పింది. ఈ ఎపిసోడ్ ప్రోమోని మాత్రమే కొంచెం ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. ఇలా సరదాగా అలీ-సమంత మధ్య జరిగిన ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 17న టెలికాస్ట్ కానుంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button