‘పైన పటారం’ పూర్తి వీడియో రిలీజ్ … ఆకట్టుకుంటున్న అనసూయ డాన్స్…!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమాలో నటించిన తరువాత తన దశ తిరిగిందనే చెప్పాలి. యాంకరింగ్ లో అవకాశాలతో పోలిస్తే సినిమాలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అనసూయ అటు సినిమాలలో, ఇటు యాంకరింగ్ చేస్తూ బిజిగా మారింది. తాజాగా ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయ “పైన పటారం. లోన లొటారం” అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో అనసూయ ఇరగదీసింది.
ఇటీవల ఈ ఐటమ్ సాంగ్ ప్రోమో విడుదల కాగా , ఇపుడు చిత్రబృందం తాజాగా పూర్తి నిడివి గల పాట వీడియోను రిలీజ్ చేసారు. ఈ పాటను మంగ్లీ, సాకేత్ కొమాండూరి పాడారు.
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చావు కబురు చల్లగా’ మూవీలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. ఆమని, మురళీశర్మ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీవాసు రూపొందిస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.