Today Telugu News Updates

ఢిల్లీలో రైతు ఎలా మృతి చెందాడో తెలిపే సీసీ కెమెరా ఫుటేజి విడుదల…వైరల్ అవుతున్న వీడియో !

CCTV footage showing how the farmer died

ఈ రోజు ఢిల్లీ లో జరిగిన రైతుల టాక్టర్ ర్యాలీలో ఎంతటి ఉద్రిక్తత చోటు చేసుకుందో ప్రపంచమంతా కోడై కూస్తుంది. ఈ ఉద్రిక్తత లో ఒక రైతుకూడా మృతి చెందిన విషయం తెలిసిందే, ఆ రైతు ని పోలీసులే కాల్చి చంపారని రైతు సంఘాలు ఆరోపిస్తున్న తరుణం లో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ని విడుదల చేసారు.

అందులో ఢిల్లీ లోని ఐటీఓ వద్ద ఒక రైతు వేగంగా వచ్చి అక్కడ ఉన్న బారికేడ్లను డీ కొట్టడంతో  ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్నీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా రైతు సంఘాలకు తెలిపారు.

ఇక చివరకి ఎర్రకోట మీదకు రైతులు ఎక్కి రైతు సంగాల జెండా ఎగురవేసి వారి నిరసనను ప్రభుత్వానికి ఘాటుగా తెలియజేసారు. రైతులకి, పోలీసులకి జరిగిన ఈ దారుణమైన ఘటనలో అటు రైతులు, ఇటు పోలీసులు గాయాలపాలయ్యారు. 

ఇక చీకటిపడటం తో నిరసనకారులు చివరికి ఇంటికి పయనమయ్యారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button