ఆముదంతో ఆరోగ్య సమస్యలకు చెక్

castor oil in telugu:: ఆముదాన్ని మన దేశంలోనే కాదు, చైనా వాళ్ళు కూడా అనేక సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. మన భారత దేశంలో మాత్రం క్రీ.పూ.2000 సం,,ర కాలం నుండి వినియోగిస్తున్నారు.ఇది మానవ శరీరంలోని విషతుల్యాలను నివారించడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
1. ఆముదాన్ని రోజు తలకు మర్దన చేయడం ద్వారా 4నెలలోనే రేచీకటి తగ్గుముఖం పడుతుంది.
2. ఈ నూనెని కాస్త కొబ్బరి నూనెలో కలిపి అరికాళ్లకు పట్టిస్తే ,కళ్ళలో వచ్చే మంటలు తగ్గిపోతాయి.
3. అలాగే కీళ్ల నొప్పులకు,ఒళ్ళు నొప్పులకు, ఎంతగానో ఉపయోగపడుతుంది.
4. ఈ నూనెను రాత్రి పడుకోబోయేముందు కొంత మోతాదులో తీసుకుంటే సుఖ నిద్రని పొందవచ్చు.
5. ఆముదం నూనెను రోజు ఒక చెంచాడు తాగడం వలన మూత్ర సంబంధ వ్యాధులను,కిడ్నీ లోని రాళ్లను నివారిస్తుంది.
6.ఇది శరీరం లోని నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది. అందుకుగాను ఆముదంను, కాస్త శొంఠి కలిపి నూరి ముద్దలుగా చేసుకొని రోజు ఒకటి వేసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది.
7. ఆముదం ఆకు రసం, కాస్త అల్లంరసం, అతి మధురం, నువ్వుల నూనె, సాల్ట్ కలిపి వేడిచేసి, ఈ నూనెను చెవిపోటుకు ఉపయోగించవచ్చు.
8.ఈ ఆకు రసం పచ్చకామెర్ల కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది.