క్యాన్సర్ రకాలు వాటి యొక్క లక్షణాలు
cancer symptoms in telugu:: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ప్రజలని ఇప్పటికి భయపెడుతూనే ఉంది. దీనిని ముందు గుర్తించాలి లేదంటే ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలను తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ ని నివారించడానికి అవకాశాలు ఉంటాయి.
1.కిడ్నీ క్యాన్సర్:-

kidney cancer symptoms in telugu ఈ క్యాన్సర్ యొక్క ప్రాథమిక లక్షణాలు బీపీ ఎక్కువ అవుతుంది,అలసటగా ఉంటుంది,బరువు దగ్గుతుంది,ఆకలి అనిపించదు,జ్వరం రావడం,మూత్రం లో రక్తం రావడం,కాలి మడమలు పగుళ్లు రావడం,వెన్ను నొప్పి ,లాంటి లక్షణాలు కనపడుతాయి.
2. చర్మ క్యాన్సర్:-

skin cancer ఈ చర్మ క్యాన్సర్ లో కొన్ని ముఖ్య లక్షణాలు,మచ్చలు ఏర్పడడం,గడ్డలు రావడం,దురద పుట్టడం, చర్మం పై దద్దురులు ఇలా లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి.
ఇందులో 3 రకాల క్యాన్సర్ ఉన్నాయి ఆవి: A) స్వామల్ సెల్ స్కిన్ క్యాన్సర్ B) బాసల్ సెల్ స్కిన్ క్యాన్సర్ C)మెలనోమా స్కిన్ క్యాన్సర్
A) స్వామల్ సెల్ స్కిన్ క్యాన్సర్:: ఈ క్యాన్సర్ కొంచం ప్రమాద కారి అయినప్పటికీ ,కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తగ్గి పోతుంది.
B) బాసల్ సెల్ స్కిన్:: ఈ క్యాన్సర్ కూడా చిన్న ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుంది.
C) మెలనోమా స్కిన్ క్యాన్సర్:: ఈ క్యాన్సర్ కాస్త ప్రమాదకారి అని చెప్పవచ్చు ఎదుకంటే దీనివల్ల పుట్టు మచ్చల యొక్క పరిమాణం,కలర్,మారడం జరుగుతుంది. అలాగే కొత్త మచ్చలు చర్మం పై ఏర్పడి వాటిచుట్టూ చర్మం ఎర్రగా మారి రక్తం వస్తుంది ఈ విదంగా దీని యొక్క లక్షణాలు ప్రమాదంగా ఉంటాయి.
3) రొమ్ము క్యాన్సర్:-

breast cancer రొమ్ములలో గడ్డలు రావడం,ఈ గడ్డలు గట్టిపడుతూ రొమ్ములో మార్పులు వస్తూ ఉంటాయి.
వీటి యొక్క లక్షణాలను గమనిస్తే..
– చర్మం దురద లాగా ఉండడం.
– నిప్పల్ లేదా రొమ్ము పై చర్మం ఎర్ర గ మారడం.
– చనుమొనలు లోపలి వెళ్లిపోవడం.
– రొమ్ము లేదా చనుమొనలలో నొప్పి రావడం.
– రొమ్ములో వాపు లాగా రావడం.
4) ఊపిరితిత్తుల క్యాన్సర్:-

lung cancer దీనిని ముందుగా కనిపెట్టడం కష్టం. ఈ క్యాన్సర్ శరీర భాగాలకు పాకినాకొద్దీ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడుతూ ఉంటాయి.
ఈ దశలో ముందుగా దగ్గు ఎడతెరపి లేకుండా రావడం,దగ్గినప్పుడు రక్తం పడడం ,నవ్వినా ,దగ్గినా నొప్పి రావడం,బరువు తగ్గిపోవడం,శ్వాస సరిగా ఆడక పోవడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ శరీర భాగాలకు పాకిన కొద్దీ,నీరసం,తలనొప్పి,ఒళ్లునొప్పులు,మేడ నొప్పి,వస్తూ ఉంటాయి. అలాగే చర్మం పాలిపోయినట్టు అవుతుంది.