calcium food in telugu

బలమైన బోన్స్ కోసం కాల్షియం మరియు Vitamin d పుష్కలంగా ఉన్న టాప్ 9 ఫుడ్స్
calcium food in telugu :: మనకు వయసు పెరిగే కొద్ది అంటే వృద్ధాప్యం మొదలు అవుతున్నప్పుడు ముఖ్యంగా మరియు సాధారణoగా మనం గమనించేది బాడీలో శక్తి క్షీణించడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, ఇలాంటివన్ని కూడా గమనిస్తుoటాము. దీనికి ఒక ముఖ్య కారణం బలహీనమైన ఎముకలు మరియు జాయింట్స్ యొక్క స్ట్రెంగ్త్. ఎముకలు, కీళ్ళు గట్టిగా,బలంగా,ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనకు కావలసిన రెండు ముఖ్యమైన కంపోనెంట్స్ కాల్షియం మరియు విటమిన్ D.
కాల్షియం మీ ఎముకలు మరియు దంతాల నిర్మాణంకి సపోర్ట్ చేస్తున్నప్పుడు విటమిన్ D కాల్షియంని అబ్సార్పషన్ ని మెరుగుపరిచి మరియు ఎముకుల పెరగడానికి Vitamin d పనిచేస్తుంది. మీ పోషకాహారంలో ఈ పోషకాలు మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీ వయస్సు పై బడుతున్నప్పుడు చాలా ముఖ్యమైనవి మరియు చాలా కీలకమైనవి. ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) లేదా ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) ఉన్న ప్రజలు తమ ఆహరoలో కాల్షియం మరియు విటమిన్ డి ని తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనం పొందవచ్చు. 50 ఏళ్లకు పైబడిన పెద్దలలో ప్రతి రోజు కాల్షియం 1200 mgs Vitamin d 400 నుండి 600 అంతర్జాతీయ యూనిట్లు (IU) తీసుకోవడం చాలా మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.
మరి బలమైన ఎముకల కోసం ఉపయోగపడే కాల్షియం మరియు Vitamin d లను మనం ప్రతి రోజు తీసుకోవడానికి అవి అధికంగా ఉండే ఆహారపదార్థాలను తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి. మరి కాల్షియo, విటమిన్ D పుష్కలంగా ఉండే టాప్ 9 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- సార్డిన్:
సార్డిన్ అనే ఒక రకమైన చేపలో కాల్షియం మరియు Vitamin d లు ఆశ్చర్యకరంగా అధిక స్థాయిలో ఉంటాయి. మీరు మీ రోజువారీ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ బారిన పడకుండా ఉండవచ్చు. ఈ సార్డిన్ ను మీ పాస్తా మరియు సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు.
- సాల్మన్:
సాల్మన్ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ అతి ఎక్కువగా కలిగి ఉండే ఒక చేప. కాబట్టి విటమిన్ డి అధికంగా కలిగి ఉన్న ఈ సాల్మన్ చేపను తప్పకుండా తీసుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన గుండె మరియు బలమైన ఎముకల కోసం మరియు ఆస్టియోపొరోసిస్ బారిన పడకుండా ఉండడానికి సాల్మన్ చేప మంచి ఫుడ్.
- ట్యూనా
ట్యూనా అనేది Vitamin d కి గొప్ప మూలం అయిన ఫాటీ ఫిష్. దీనిని మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన రోజువారీకి సరిపడే విటమిన్ D 39% వరకు మన శరీరానికి సమకూరుతుంది.
- యోగర్ట్:
చాలామందికి డి విటమిన్ తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవడం అవసరం అని రికమెండ్ చేస్తుంటారు. ప్రతి రోజు మన బాడీకి కావలసిన Vitamin d ని తయారు చేసే కొన్ని ఆహారపదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో యోగర్ట్ (పెరుగు) ఒకటి. ఇది మన రోజువారీ అవసరమయ్యే కాల్షియం మరియు విటమిన్ డి ని అందించి మరియు ఆస్టియోపొరోసిస్ బారినపడకుండా నివారిస్తుంది.
- చీజ్:
చీజ్ కాల్షియం యొక్క అద్భుతమైన సోర్స్, ఇది మరొక పాల ఉత్పత్తి. చీజ్ కూడా Vitamin d చిన్న మొత్తంలో కలిగి ఉంది. అయితే, ఈ చీజ్ ని మరి అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశo ఉంటుంది కాబట్టి చీజ్ ని తగు మోతాదులో తీసుకోవాలి.
- గుడ్లు:
గుడ్లు సూపర్ ఆరోగ్యకరమైనవి! ఇవి శరీరానికి వివిధ అవసరమైన పోషకాలని అందిస్తాయి. విటమిన్ డి ని తీసుకోవడం కోసం కూడా వీటిని మన ఆహారంలో తీసుకోవచ్చు. మన రోజువారీ అవసరమయ్యే Vitamin d లో 6% ఎగ్స్ ద్వారా మనకు లభిస్తాయి. గుడ్లు మనకు సులభంగా అందుబాటులో ఉoటాయి మరియు రుచికరంగా కూడా ఉంటాయి. ఖర్చు కూడా తక్కువ. అంతేకాక, విటమిన్ డి ఎక్కడ ఎక్కువగా ఉన్నదో ఆ పచ్చసొన తినడo మరిచిపోకండి.
- పాలకూర:
పాలoటే ఇష్టపడని వారు కాల్షియం తీసుకోవడం కోసం పాలకూరను తీసుకోవచ్చు. మీ రోజువారీ అవసరమయ్యే కాల్షియంలో 25% వరకు వండిన ఒక కప్పు పాలకూర ద్వారా మనకు అందుతుంది. అంతేకాకుండా, పాలకూర ఐరన్, విటమిన్ ఎ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆకుపచ్చని వెజ్జి. కానీ వర్షాకాలంలో ఈ ఆకుకూరని ఆహారంలో తీసుకోవడం అంత మంచిది కాదు.
- పాలు:
పాలు కాల్షియం యొక్క అద్భుతమైన సోర్స్. అందుకే పాలను తీసుకోవడం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తప్పనిసరి అన్నది ముఖ్య కారణం. పాలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశo తగ్గుతుంద9. ఆరెంజ్ జ్యూస్
తాజాగా పిండిన ఆరంజ్ జ్యూస్ విటమిన్ డి మరియు కాల్షియంను మనకు అందిస్తుంది. అంతేకాకుండా, ఆరంజ్ జ్యూస్ లో ఆస్కార్బిక్ యాసిడ్ కూడా కాల్షియం శోషణకు దోహదపడుతుంది. ఆరంజ్ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ రాకుండా నిరోధిస్తుంది.
కాబట్టి మీకు బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలు కావాలంటే వాటికోసం ఉపయోగపడే కాల్షియo మరియు Vitamin d కోసం అవి పుష్కలంగా లభించే పైన చెప్పిన ఆహారపదార్థాలను ఈ రోజు నుండి మీ ఆహారంలో తప్పక తీసుకోండి.