Burn Belly fat Tips : పొట్ట తగ్గాలంటే ఇలా చేయండి..!
Burn Belly fat Tips : మన రోజు వారి జీవన విధానం వల్ల చిన్న వయసులోనే పొట్టలు వస్తున్నాయి. శరీరానికి సరైన శ్రమ లేకపోవడంతో 20స్ లోనే వేలాడే పొట్టలు వేసుకుని తిరుగుతున్న యువతను మనం చూస్తూనే ఉన్నాం.. అయితే కొందరికి పొట్ట తగ్గించుకోవాలని ఉన్న ఎలా తగ్గించాలో అర్థం కాదు. అందుకే ఈ సలహాలు పాటించారంటే ఈజీగా పొట్టను తగ్గించుకోవచ్చు.

1. పొట్ట తగ్గాలంటే ఎక్ససైజ్ డైట్ చాలా ముఖ్యం.
2. చాలామంది పొట్ట తగ్గడానికి పొట్టకు సంబంధించిన ఎక్ససైజ్స్ మాత్రమే చేస్తారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. శరీరంలో ఏ పార్టులోనైనా కొవ్వు అలా కరగదు. బాడీ అంతట ఒకేసారి కరుగుతుంది.
3. ఫుడ్ ని లిమిట్ లో తీసుకోవాలి. ముఖ్యంగా నైట్ పూట చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.
4. తీసుకునే ఫుడ్ లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి
5. జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళద్దు
6. ఆరు నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలి
7. స్ట్రెస్ ని తగ్గించుకోవాలి