Bumper Offers to Pooja Hegde : బుట్ట బొమ్మ , మెగా హీరోలతో హంగామా :-

Bumper Offers to Pooja Hegde : వరుస సినిమాలతో భాషకు సంబంధం లేకుండా హిట్ మీద హిట్ కొడుతున్న ఒకేఒక బ్యూటీ పూజ హెగ్డే. ఈ బుట్ట బొమ్మకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ 5 సినిమాలతో బిజీ గా ఉన్న మెగా హీరోలు అనేసరికి షెడ్యూల్స్ చూడకుండానే ఆఫర్ ఒపుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా పూజ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవ్వనుంది.
ఇపుడు పవన్ కళ్యాణ్ 28 వ చిత్రం లో పూజ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. దీనితో పాటు అల్లుఅర్జున్ , వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా ఫిక్స్ చేశారంట.
బన్నీ తో ఇప్పటికే 2 సార్లు కలిసి బ్లాక్ బస్టర్ పెయిర్ గా గుర్తింపు పొందిన ఈ భామ బన్నీ తో హ్యాట్రిక్ కి సిద్ధమైంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పూజ హీరోయిన్ గా అనుకుంటున్నారు.
ఇదే కనుక నిజం అయితే పూజ టాప్ రేంజ్ ని ఎవ్వరు ఆపలేరు. చూడాలి మరి అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో.