Buchi Babu is in Dilemma : బుచ్చి బాబు కి హీరో దొరకడం లేదు ? :-

Buchi Babu is in Dilemma : డెబ్యూ డైరెక్టర్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఉప్పెన సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాసిన విషయం అందరికి తెలిసింది. మొదటి సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టినా బుచ్చి బాబు. తన రెండవ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ బూచి బాబు సినిమా కష్టమే అని తెలుస్తుంది.
కాబట్టి బూచి బాబు మరల వైష్ణవ తేజ్ తోనే సినిమా చేయాలనుకున్నారు , కానీ వైష్ణవ తేజ్ కూడా ఒకేసారి 3 సినిమాలు అనౌన్స్ చేయడం తో అది కూడా కుదరని పని అని అర్ధం అయింది. ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కూడా రెండవ సినిమా చేయడానికి హీరో దొరకకపోవడంతో ఏ హీరో తో తీయాలని డైలమా లో ఉన్నారు.
కాకపోతే చిన్న హీరోతోనే మళ్ళీ సినిమా ప్లాన్ చేయాలనీ ఫిక్స్ అయ్యారని అర్ధం అయింది. చూడాలి మరి బుచ్చి బాబు తదుపరి హీరో ఎవరని ఏదురుచూడాలి.