BRO OTT release date confirmed : బ్రో రిలీజ్ ఏ ఓటీటీ లో అంటే…
BRO OTT release date confirmed : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటే చాలు పీకే ఫ్యాన్స్ కి ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేనని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్లో సమీపిస్తున్న సందర్భంగా పాదయాత్రలతో, బస్సు యాత్రలతో పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో పవర్ స్టార్ ఒక కీలక పాత్రలో నటించగా..సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా మెరిసారు. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పైన నిర్మించారు. ఈ చిత్రానికి సముద్రకాన్ని దర్శకత్వాన్ని వహించారు. ఈ బ్రో మూవీ తమిళంలోని వినోదయ సీతమ్ అనే మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశారు.

అయితే బ్రో మూవీ రిలీజ్ అయ్యి నెల గడుస్తున్న కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ మూవీ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. భీమ్లా నాయ,క్ వకీల్ సాబ్ సినిమాల తర్వాత రావడంతో బ్రో సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు తీయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఈ మూవీ ఆగస్టు 25న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు మూవీ యూనిట్ తాజాగా వెల్లడించింది