Entertinementmovie reviewstelugu cinema reviews in telugu language

BRO Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

BRO Movie Review and Rating

Movie :- BRO (2021) Review

నటీనటులు :- నవీన్ చంద్ర , అవికా గోర్ , సంజన , సాయి రొనక్ మొదలగు.

నిర్మాతలు :- జే.జే.ఆర్.రవిచంద్

సంగీత దర్శకుడు :- శేఖర్ చంద్ర

డైరెక్టర్ :- కార్తిక్ తుపురని

ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.

Story ( Spoiler Free ) :-

ఈ కథ మాధవ్ ( నవీన్ చంద్ర ) మరియు సుబ్బు ( అవికా గోర్ ) మధ్య సాగె కధనం. సుబ్బు అనారోగ్యం తో బాధ పడుతుంది. సుబ్బు కి అవసరమైన మెడిసిన్స్ కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటుంది ఫ్యామిలీ. చేసేదేం లేక సుబ్బు తల్లిదండ్రులు మాధవ్ ని డబ్బుల కోసం లేబర్ గా పనిచేసేందుకు సౌదీ అరేబియా కి పంపిస్తారు. అలాగైనా సుబ్బు ట్రీట్మెంట్ మరియు మెడిసిన్స్ కోసం డబ్బులు వస్తాయి అని.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాధవ్ సౌదీ వెళ్ళి లేబర్ పని చేసే సమయంలోనే సుబ్బు చనిపోతుంది. ఇప్పుడు మాధవ్ ఎం చేయబోతున్నాడు ? సుబ్బు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? మాధవ్ ని సౌదీ నుంచి ఇండియా కి పంపించగలరా ? మాధవ్ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? సుబ్బు చనిపోయాక మాధవ్ ఎం చేసాడు ? సుబ్బు కోసం మాధవ్ ఎం చేసాడు ? చివరికి ఎం జరిగింది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా సోనీ లివ్ లో చూడాల్సిందే.

Positives 👍 :-

  • నవీన్ చంద్ర మరియు అవికా బ్రదర్ మరియు సిస్టర్ లా చాలా బాగా చేశారు. ఇద్దరు పాత్రలో జీవించేశారు. ప్రేక్షకులు విరి నటనతో ఆకట్టుకునేలా చేశారు.
  • మొదటి భాగం మరియు సినిమా యొక నిడివి.
  • సెంటిమెంట్ సన్నివేశాలు.
  • ఎడిటింగ్ పర్వాలేదు.
  • సినిమాటోగ్రఫీ సూపర్. విజువల్స్ చాలా బాగున్నాయి.
  • మ్యూజిక్ ఓకే.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives 👎 :-

  • దర్శకుడు మొదటి భాగం తేసినంత భాగంగా రెండవ భాగం సరిగా తియలేకపోయారు. ఫ్రెష్ ఫీల్ పోతుంది.
  • మిగితా నటీనటులు సినిమా లో ఉన్న స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేకపోవడం తో పెద్దగా గుర్తుండరు.
  • స్లో గా సాగుతుంది.

Overall :-

మొత్తానికి BRO అనే సినిమా కథలో కొత్తదనం ఉన్న దర్శకుడు మొదటి భాగం ను తీసిన విధంగా రెండవ భాగం తియ్యలేకపోయారు. కథనం స్లో గా ఉన్నపటికీ మొదటి భాగం లో ఫ్రెష్ ఫీల్ వస్తుంది, కానీ రెండవ భాగం వచ్చేసరికి నిరాశ చెందిస్తుంది. నవీన్ చంద్ర మరియు అవికా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.

సినిమాటోగ్రఫీ సూపర్ గా చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఓకే కానీ ఎడిటింగ్ బాలేదు చాలా వరకు ట్రిమ్ చేసేయాలి. మొత్తానికి BRO అనే సినిమా ఒకసారి ఓపిక తో చూసే వాళ్ళు చూసేయచు లేదా కొత్తదనం కోరుకునే వారు కూడా ఓసారి చూడచ్చు.

Rating :- 2.25 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button