Bro Movie AP Minister : బ్రో సినిమాలో ఆ మినిస్టర్ పై సెటైరికల్ సీన్.. నిజమెంత?
Bro Movie AP Minister : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్న.. ఆయన విజువల్ చూసిన.. ఆయన అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేనని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాదయాత్రలతో, బస్సు యాత్రలతో పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో పవర్ స్టార్ ఒక కీలక పాత్రలో నటించగా..సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా మెరిసారు. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పైన నిర్మించారు. ఈ చిత్రానికి సముద్రకాన్ని దర్శకత్వాన్ని వహించారు. ఈ బ్రో మూవీ తమిళంలోని వినోదయ సీతమ్ అనే మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ చిత్రానికి మాటల మంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశారు.

ఇదిలా ఉంటే బ్రో సినిమాలో ఒక్క సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. AP Minister Ambati Rambabu ని సెటైరికల్ గా సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర ఉంది.. ఆ పాత్రలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి నటించాడు. అప్పట్లో సంక్రాంతికి మహిళలతో రాంబాబు వేసిన స్టెప్పులు .. అదే స్టెప్పులను ఓ పబ్ లో పృద్వితో వేయించడం సర్వత్ర చర్చనీయంగా మారింది. అయితే సినిమాలో ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత పవర్ స్టార్ కావాలనే మినిస్టర్ రాంబాబు పాత్రను సెటైరికల్ గా చూపించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు