News
బెంచి మీద కూర్చుందని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఎందుకంటే

రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీనికితోడు కరోనా స్ట్రెయిన్ తో కలకలం రేపుతోంది.
బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ నువిజృంభించకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను బ్రిటన్ గవర్నమెంట్
ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా ఈ కర్ఫ్యూ కు సంబంధించిన నియమాలను మరింత కఠినతరం చేస్తున్నట్టు బుధవారం బ్రిటిష్ ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దీంతో పోలీసులు నియమాలు పాటించని వారిపై కేసులు,జరిమానాలతో పాటు అరెస్టు చేస్తున్నారు
బ్రిటన్ లోని లండన్లో ఉన్న సముద్రం వద్ద ఓ మహిళ సేద తీర్చుకోవడానికి కూర్చుంది దీంతో కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చేందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి