telugu gods devotional information in telugu

ఏ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం గా నిర్ణయిస్తారో తెలుసా…మీకు !

BRAMHA MUHURTHAM

మనం ఒక మంచి పని తలపెట్టాలంటే ఎవరైనా ఒక మంచి ముహూర్తం కోసం చూస్తూ ఉంటారు. మరి ఆ మంచి ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం . ఈ ముహూర్తం ఎపుడు వస్తుంది. దీనివలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?

ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజలు, వ్రతాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. అనే విషయాలు చాల కొద్దీ మందికి మాత్రమే అవగాహనా ఉంటుంది.
మరి ఆ కొద్దిమంలో బ్రాహ్మణులే ఉంటారు. వారినే ప్రజలు మంచి ముహూర్తం చెప్పండి అని అడుగుతూ ఉంటారు.

ఇలా కొన్ని తరాలనుండి బ్రాహ్మణులు చెప్పిన సమయానికి, ప్రజలు వారి శుభకార్యాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు నిర్ణయించే ముహుర్తాలు ఎక్కువగా తెల్లవారు జామున ఉంటూ ఉంటాయి. ఎందుకో తెలుసా… ఎందుకంటే బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి 40 ని,, ముందు ఉండడం వలన అంటే ఉదాహరణకు ఈ రోజు సూర్యోదయం 6:30 అయితే 5:50నిమిషాల నుంచి 6 గంటల 30 వరకు బ్రహ్మ ముహూర్తం అని చెప్పవచ్చు. ఈ సమయంలో శుభకార్యాలు చేపట్టడం వాళ్ళ సకల శుభాలు జరుగుతాయని పండితులు చెబుతారు.

అలాగే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వలన అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నిద్ర లేస్తారో వారిపై పడే సూర్యుడి లేలేత కిరణాల వల్ల మన శరీరానికి విటమిన్ డి అందుతుంది. అదేవిదంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందడంవల్ల ఆ రోజు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే చదివింది గుర్తుండటంతో పాటు అసాధారణమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
అందుకనే బ్రహ్మ ముహూర్తంలో తలపెట్టిన శుభకార్యాలు మంచి ఫలితాలను తెచ్చిపెడుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button