News

Boney Kapoor: ఆర్ఆర్ఆర్ విడుదల చేయొద్దంటూ రాజమౌళి పై విరుచుకుపడ్డ బోనీకపూర్

Boney Kapoor: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఆర్ ఆర్ ఆర్”.. ఈ చిత్రంలో మల్టీ స్టారర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మేరకు ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా..ఆర్ఆర్ఆర్ ను అక్టోబర్ 13 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదల పై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మైదాన్ చిత్రం అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లు డిసెంబర్లో ప్రకటించిన.. ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదలను మా సినిమాకు రెండు రోజుల ముందే విడుదల చేస్తామని ప్రకటించడం అనైతికమని అన్ని మండిపడ్డారు.

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయంపై రాజమౌళి కి ఫోన్ చేస్తే తనకేమీ సంబంధం లేదంటూ ప్రవర్తించడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button