మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని సమర్థిస్తూ బాంబేహైకోర్టు తీర్పు….మండిపడుతున్న బాలల హక్కు సంఘాలు !

ఒక మైనర్ బాలికను స్నేహపూర్వకంగా తాకితే అది తప్పు ఎలా అవుతుందని తెలుపుతూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక బాంబే కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వల్ల యువత పెడదోవ పట్టే ప్రమాదముందని అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్ తెలిపారు.
అయితే ఈ మధ్యన బాంబే కోర్టు ఈ నెల 19 న ఒక అమ్మాయిని ముట్టుకోకుండా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం ప్రకారం అది లైంగిక దాడి కిందికిరాదని జస్టిస్ పుష్ప గనెడివాలా ఈ ఉత్తర్వులు జారీ చేసారు.
డిసెంబరు 2016లో నాగపూర్ కి చెందిన సతీష్ అనే అబ్బాయి తనకు స్వీట్ ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఒక 12 ఏళ్ళ అమ్మాయి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువకునికి ఆ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష వేసింది.
ఆ తీర్పుకు సవాలుగా ఆ వ్యక్తి బాంబేహైకోర్టును ఆశ్రయించాడు . దీనికి సంబంధించి బాంబే కోర్టు ఆ వ్యక్తి ని సమర్థిస్తూ నిర్దోషిగా తీర్పు నివ్వగా, బాలల హక్కుల సంఘాలు ఈ తీర్పు పై ఆగ్రహం తెలిపాయి.