Tollywood news in telugu
ఆ దేశం వెళ్లి ఇరుక్కు పోయిన బాలీవుడ్ బ్యూటీ !

Priyanka Chopra : కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలు కుదేలైపోయాయ్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాలు , మరో మహమ్మారి స్ట్రెయిన్ వచ్చింది అని తెలియడంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ముక్యంగా ఈ మహమ్మారి బ్రిటన్ లో ఎక్కువ ఉండటంతో , మిగితా దేశాలతో సంబంధాలు ప్రస్తుతం దూరమయ్యాయి. బ్రిటన్ లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. ఈ తరుణం లో షూటింగ్ కి వెళ్లిన ప్రియాంక చోప్రా లండన్ లో ఇరుక్కుపోయింది.
ప్రియాంక ఒక హాలీవుడ్ సినిమా షూటింగ్ ఉండడంతో యూకే వెళ్ళింది. స్ట్రెయిన్ వైరస్ కారణంగా ప్రియాంక మరికొన్ని రోజులు అక్కడే ఉండే పరిస్థితి నెలకొంది. ప్రియాంక ‘టెక్ట్స్ ఫర్ యూ’ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కి జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహించగా ,హాలీవుడ్ నటుడు సామ్ హ్యూగన్ కు జోడీగా ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది.