Tollywood news in telugu

చరణ్ తో జతకట్టనున్న బాలీవుడ్ బ్యూటీ… !

Bollywood beauty to pair up with Charan

 రామ్ చరణ్ హీరోగా నటించిన  ‘వినయ విధేయ రామ’ చిత్రంలో బాలీవుడ్ నటి  ‘కియారా అద్వానీ’ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. గతం లో  చరణ్ తో కియారా  జోడీ చాల  బాగుందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కూడా  కురిపించారు.

ఇపుడు మల్లి ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ  దర్శకులలో ఒకరైన తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ను  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇనులో  కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలు కూడా వినపడ్డాయి.

కానీ ఆ స్థానాన్ని ఇపుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్  కియారా అద్వానీ భర్తీచేయనుందని తెలుస్తుంది.  ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే గనక నిజం అయితే  మరోసారి ఈ జంట వెండితెరపై కనువిందు చేయనున్నారు.

శంకర్ దర్శకత్వం లో ఒక  పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. ఏ మూవీ కి సంబంధించి  ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button