health tips in telugu

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లూ టీ గురించి ఎప్పుడైనా విన్నారా?

blue tea benefits

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉoడడానికి మంచిఆహరంతో పాటు వ్యాయామం కూడా తప్పనిసరి. అంటే వాకింగ్, జాగింగ్, జిమ్ వర్క్ఔట్స్, యోగా ఏదైనా కావచ్చు. ఇవి అన్ని కూడా మనం ఫిట్ గా ఉండడానికి మరియు అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గడంలో టీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. టీ అంటే పాలు, టీ పౌడర్, షుగర్ వేసుకొని కాదండి. విత్ అవుట్ షుగర్, అండ్ మిల్క్. ఉదాహరణకి గ్రీన్ టీ, బ్లాక్ టీ అన్న మాట. ప్రతి రోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చు అని న్యూట్రిషన్స్ చెపుతున్నారు. చాలా మందికి గ్రీన్ టీ, బ్లాకు టీ మాత్రమే తెలుసు. మరి బ్లూ టీ గురించి ఎపుడైనా విన్నారా?? అదాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.

Blue tea ని “బటర్ ఫ్లై పీ” ఫ్లవర్స్ నుంచి తయారు చేస్తారు. ఈ టీ రంగు నీలి రంగులో ఉంటుంది కాబట్టి దీనికి బ్లూ టీ (అపరాజిత) అని పేరు పెట్టబడింది.

ఈ మధ్యకాలంలో గ్రీన్ టీ బాగా ప్రాచుర్యం పొందింది, అయితే దాని చేదు రుచి కారణంగా అలవాటు చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ బ్లూ టీ అనేది అంగిలి మీద పెట్టుకున్నపుడు ఒక తియ్యటి మరియు మట్టి రుచిని  కలిగి ఉంది.

బ్లూ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Blue tea ఒక మెమరీ బూస్టర్ :

బ్లూ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వలన జ్ఞాపకశక్తిని పెంచే లక్షణాలకు కారణమవుతుంది. ఈ బ్లూ పీ ఫ్లవర్స్ మన బాడీలో జ్ఞాపకశక్తిని మరియు మెదడు పనితీరుకు సహాయపడే ఎసిటైల్ కోలిన్ (ఒక న్యూరోట్రాన్స్మిటర్) పెరగడానికి సహాయపడుతుoది.

ఇది ఆందోళనను తగ్గిస్తుంది:

Blue tea ఫ్లవర్స్ అధిక మోతాదులో ప్రయోజనకరమైన యానక్జియోలియోటిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి మరియు దీని వలన శరీరంలో ఒత్తిడి కలిగకుండా హెల్ప్ చేస్తుంది.

ఇది ఆస్తమాకి  ఉపశమనం కలిగిస్తుంది:

Blue tea, దగ్గు, జలుబు మరియు ఉబ్బసం నుండి ఉపశమనం కలిగించటానికి సహాయపడుతుంది, ఇది ఒక కఫహరంగా పనిచేస్తుంది. ఇంకోలా చెప్పాలి అంటే శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు నుండి మ్యూకస్( శ్లేష్మం ) ని క్లియర్ చేయడంలో  సహాయపడుతుంది.

ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది:

చర్మం క్రింద ఉన్న రక్త నాళాలలో ఉన్న వేడిని బయటికి తీయడం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో బ్లూ టీ సహాయపడుతుంది. ఇది లోపల గాలి ద్వారా రక్తాన్ని సులభంగా చల్లబరుస్తుంది.

ఇది డయాబెటిస్ చికిత్సలో సహాయపడుతుంది:

బటర్ ఫ్లై పీ పువ్వులు ఆహారo నుండి గ్లూకోస్ ని తీసుకోకుండా నిరోధిస్తాయి మరియు ఈ విధంగా, టైప్ II డయాబెటీస్ చికిత్సకు సహాయపడతుంది.

బ్లూ టీ లో ఎక్కువగా ఆంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి:

Blue tea యొక్క గొప్ప రంగు దానిలో అధిక పరిమాణoలో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయని సూచిస్తుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ రిస్క్ ని తగ్గిస్తాయి, చర్మం ముడతలు పడకుండా మరియు జుట్టు తెల్లబడకుండా ఉండేలా సహాయపడుతుంది.

ఇది ఒక యాంటీ – ఇనఫ్లమేటరీ:

బ్లూ ఫ్లవర్స్ లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ – ఇనఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కూడా రోగనిరోధకతను పెంచడానికి సహాయపడతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button