డిజిటల్ డివైసెస్ నుండి వచ్చే బ్లూ లైట్ ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
Blue light causes blindness?

ఈ రోజుల్లో ప్రతిఒక్కరు ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ డివైసెస్ తో సమయాన్ని గడుపుతుంటారు. ఈ డిజిటల్ పరికరాల్లో ముఖ్యంగా చెప్పాల్సినవి స్మార్ట్ ఫోన్స్. ఇవి మన చేతిలో ఉంటే ప్రపంచo అంతా మన గుప్పిట్లో ఉన్నట్టే. ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల మనకు ఉన్న ఉపయోగాల సంగతి తెలియదు కాని దీని నుండి వచ్చే బ్లూ లైట్ వల్ల మన కంటి చూపు తగ్గిపోయి మెల్లగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఇది కేవలం స్మార్ట్ ఫోన్స్ వల్ల మాత్రమే కాదు, ఇతర డిజిటల్ పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ అంధత్వాన్ని వేగవంతం చేయగలదని పరిశోధకులు కనుగొన్నారు.
ఎక్కువసేపు ఈ బ్లూ లైట్ కి ఎక్స్పోస్ అవడంవలన కంటి యొక్క లైట్ -సెన్సిటివ్ కణాలలో విషపూరిత అణువులను ఉత్పత్తి చేయవచ్చు మరియు కంటిలో ఉండే మాక్యుల క్షీణతకి దారితీస్తుంది.
అంధత్వం యొక్క ప్రధాన కారణాలలో ఒకటి మాక్యులా క్షీణించడం కాని దీనివల్ల మొత్తం కంటి చూపు పోవడానికి దారితీయదు, కానీ రోజువారీ చేసుకొనే పనులను కష్టతరం చేస్తుంది.
Blue light causes blindness? : “బ్లూ లైట్ మన కంటి రెటీనా దెబ్బతీయడం ద్వారా మన చూపుకు హాని కలిగిస్తుంది. ఇది నెమ్మదిగా మాక్యుల క్షీణతకు దారితీస్తుంది”. ఒక రకమైన లైట్ –సెన్సిటివ్ సెల్స్ అయిన ఫోటోరిసెప్టార్ల డెత్ వలన మాక్యులర్ క్షీణత సంభవిస్తుంది.
మెదడు లైట్ మరియు ట్రిగ్గర్ సంకేతాలను గ్రహించటానికి ఫోటరిసెప్టర్ సెల్స్ కి రెటినాల్ అనే మాలిక్యుల్స్ అవసరం, వీటి ద్వారానే మనకు చూడటానికి వీలు కలుగుతుంది.
Blue light causes blindness? “ఒక వేళ రెటీనాపై బ్లూ లైట్ పడినప్పుడు, ఆ పొరపై సిగ్నలింగ్ మాలిక్యుల్ గా కరిగిపోయి రెటీనా ఫోటోరెసెప్టర్ కణాలను చంపుతుంది. ఈ “ఫొటోరిసెప్టర్ కణాలు కంటిలో తిరిగి పునరుత్పత్తి చేయబడవు. పరిశోధకులు బ్లూ లైట్ నుండి మన కళ్ళను కాపాడటానికి, బయట ఉండే UV మరియు బ్లూ లైట్ ని ఫిల్టర్ చేసే సన్ గ్లాసెస్ ధరించమని సలహా ఇస్తున్నారు. చీకటిలో స్మార్ట్ ఫోన్స్ లేదా టాబ్లెట్స్ ని ఉపయోగించకూడదు అని సూచిస్తున్నారు. సో బీ కేర్ ఫుల్. ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మన కళ్ళను కాపాడుకోవడానికి సాధ్యమైనంత వరకు డిజిటల్ డివైసెస్ కి దూరంగా ఉంటే మంచిది.