sports news in telugu
మురికి వాళ్ళు అంటూ టీమిండియా క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు

ఇటీవల సిడ్నీలో జరిగిన ఆసీస్-ఇండియా 3వ టెస్ట్ మ్యాచ్ లో కంగారు అభిమానులు జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్ పై మంకీ,బ్రౌన్ డాగ్ వంటి జాతి వివక్ష వాఖ్యలను చెయ్యడంతో.. వారిని సెక్యూరిటీ గార్డ్ లు స్టేడియం నుండి బయటకు పంపేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ వివాదం సద్దుమణిగిందన్ని అనుకునే లోపలే నేడు గబ్బా స్టేడియంలో జరుగుతున్న ఆసీస్-ఇండియా నాలుగో టెస్ట్ లో మళ్లీ కంగారులు ఆ వివాదానికి తెరలేపారు. టీం ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పై మురికి అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలను కంగారు అభిమానులు చేశారు.
దీంతో సిరాజ్ ఎంపైర్ కి కంప్లైంట్ చేసాడు. ఇది కోఇన్సిడెన్స్ కాదని…కావాలనే ఇలా చేస్తున్నారని సిరాజ్ కంగారు అభిమానులపై మండిపడ్డారు.