Black Fungus Onions : బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డను తింటే ఏమవుతుంది?
Black Fungus Onions : మనం ఇంట్లో ఉల్లిగడ్డలను నిలువ పెడుతుండడంతో.. అప్పుడప్పుడు ఉల్లిగడ్డల పైన బ్లాక్ కలర్లో బూజు లాగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామందికి వాటిని తింటే ఏం కాదా అనే సందేహం వచ్చి ఉంటుంది. అలా నల్లటి బూజు కలిగి ఉండడాన్ని బ్లాక్ ఫంగస్ అంటారు. అయితే కొంత మంది ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు ఆ బ్లాక్ ఫంగస్ ని శుభ్రం చేయకుండా అలాగనే కోస్తూ ఉంటారు. అలా చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారి ప్రాణానికి బ్లాక్ ఫంగస్ చాలా ముప్పు తేస్తుంది.

బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డలు ఏం చేయాలి?
ఏం లేదు బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డలను మంచిగా వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత బ్లాక్ కలర్ పోయేలాగా మొత్తం పొట్టు తీసి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఉల్లిగడ్డకె కాదు మొక్కజొన్నకు లేదా ఎలాంటి పదార్థానికైనా ఇలానే ఫంగస్ ని తీసేసి వాడుకోవాలి.