Tollywood news in telugu
బ్లాక్ బోర్డ్ సినిమా ట్రైలర్ విడుదల చేసిన హీరో ప్రిన్స్ : ట్రైలర్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ :

బ్లాక్ బోర్డ్ సినిమా ట్రైలర్ విడుదల చేసిన హీరో ప్రిన్స్ :
ట్రైలర్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ :
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో ,
తల్లాడ శ్రీ లక్ష్మీ నిర్మాణ సారథ్యంలో
ఎందరో మహానుభావులు చిత్రం తర్వాత
తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా
తల్లడా సాయి కృష్ణ
దర్శకత్వం చేస్తూ
నటించిన సినిమా ” బ్లాక్ బోర్డ్”.
ఈసినిమా ట్రైలర్ ని
యువ హీరో ప్రిన్స్ విడుదల చేశాడు.
ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ
సాయి కృష్ణ చేసిన బ్లాక్ బోర్డ్ సినిమా
ట్రైలర్ చాలా బాగుంది.
ఇందులో తను ద్విపాత్రాభినయం చేయడం చాలా క్యూరియూసీటీ గా ఉంది.
ముఖ్య అతిధిగా వచ్చిన
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ
సాయి కృష్ణ ని మెచ్చుకోవడం కంటే
ముందు వాళ్ళ నాన్న ని అభినందించాలి
పిల్లల అభిప్రాయం తగ్గట్లు వారి భవిష్యత్ కి కూడా ఇలా తండ్రి గా, నిర్మాత గా చేయడం గర్వించదగ్గ విషయం.
సాయి కృష్ణ చేసిన బ్లాక్ బోర్డ్ సినిమా
ముఖ్యంగా మాస్ ని,
క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
నిర్మాత తల్లాడ శ్రీనివాస్
మాట్లాడుతూ
సినిమా ని అనుకున్న టైమ్ లో
మా టీమ్ సపోర్ట్ తో
అనుకున్నట్లు తీయడం జరిగింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
త్వరలో విడుదల తేది ని ప్రకటిస్తాం.
దర్శకుడు&హీరో సాయి కృష్ణ మాట్లాడుతూ :
ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా.కథ కి తగ్గట్టుగా సినిమా ని షూటింగ్ అంత ఖమ్మం జిల్లా లొనే తీసాం.
షూటింగ్ సమయంలో మినిస్టర్
పువ్వడా అజయ్ గారు కూడా వచ్చి మాకు ప్రోత్సహాం అందించారు.
ట్రైలర్ చూసిన హీరో ప్రిన్స్,
నిర్మాత రామ సత్యనారాయణ గారు,
పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ట్రైలర్ లో మంచి కంటెంట్ ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో
మరొక దర్శకుడు సయ్యద్,
రాధ కృష్ణ పులవర్తి ,
నూతన సినీ హిరోలు
సాగర్ శైలేష్,అనిల్,చిన్న ,రాజ్ కుమార్,
హీరోయిన్ మాధురి చిగురు లు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి నటి నటులు గా
తల్లాడ సాయి కృష్ణ,
శిరీషా రావ్, విజయ్ దేశిని.
కెమెరా : శివ,
మేనేజర్ : రాజు
సంగీతం: వి.ఆర్.ఏ ప్రదీప్,
ఎడిటింగ్: క్రాంతి,
పబ్లిసిటీ డిజైనర్:కార్తీక్,
డైరెక్షన్ విభాగం: బాలు,శివ కాకు,
జంగాల సాయి.
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్.