Today Telugu News Updates

dubbaka : దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి ఘనవిజయం

dubbaka

దుబ్బాక ఉప ఎన్నికలలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠనికి తెరపడింది. టిఆర్ఎస్,బీజేపీ మధ్య హోరాహోరీ గా ఓట్ల లెక్కింపు జరగగా చివరకు బిజెపి అభ్యర్థి మదవనేని రఘునందన్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పై 1,118 ఓట్ల తో ఘనవిజయం సాధించాడు.

తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు నుండి టిఆర్ఎస్ పై ఆధిక్యంలో ఉన్న కమలం మధ్యలో కాస్త తడబడుతూ చివరికి మళ్ళీ పుంజుకుంటూ ఘన విజయం సాధించింది.

బీజేపీ  ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, డోలు బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులుతో సంబరాల్లో మునిగితేలుతున్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దుబ్బాక ప్రజలు చాల చైతన్యవంతులు, దుబ్బాక ప్రజలను ఇక ఎవరు ఆపలేరని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన మేము ముందు ఉంటామని తెలిపారు.

ఈ ఉబ్బక విజయం ను ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం చేస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button