News
Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆందోళనలో ప్రజలు
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులగా వేల పక్షులు బర్డ్ ఫ్లూ వైరస్ తో మరణిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తెనాలిలో వందల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రా ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు కూడా సోకుతుందని, అలాగే అది సోకితే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు చెప్తున్నారు. దీంతో ఇటు కరోనా అటు బర్డ్ ఫ్లూ వైరస్ తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు