Political News

బీజేపీ కి షాక్ తగలనుందా..! Bihar assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . Bihar assembly elections 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి . అక్టోబర్ 28 న తొలి దశ , నవంబర్ 3 న రెండో దశ , నవంబర్ 7 న మూడో దశ పోలింగ్ నిర్వహించారు . తుదిదశ పోలింగ్ లో 55.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది . సాయంత్రం 6 గంటల సమ యానికి క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిం చారు . దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది . కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు .

తుది విడతలో 19 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో పోలింగ్ జరి గింది . వాల్మీకి నగర్ లోకసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు . సాయంత్రం 5 గంటల వరకు 52.08 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికా రులు వెల్లడించారు . చివరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 12 వందల మంది అభ్యర్థులు బరిలో దిగారు . బీహార్ స్పీకర్ విజయ్ కుమార్ సహా 12 మంది మంత్రులు , కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్ ఈ విడత ఎన్నికల్లోనే పోటీపడ్డారు . పుర్ణియాలో ఓటర్లు ఓట్లు వేయకుండా కొందరు అడ్డుకోగా .. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు . అరారియాలో జోకియాట్ ఆర్జేడి అభ్యర్థి చొక్కాకు పార్టీ గుర్తు బ్యాడ్జి వేసుకుని ఓటు వేయడానికి వచ్చారు . ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందున ఆయనపై చట్టపరమైన చర్యలు తీసు కుంటామని అధికారులు తెలిపారు .

ఖతియా లోని 12 కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు నిరాకరించారు . తమ ప్రాంతంలోని రెండు రైల్వే క్రాసింగ్ ల వద్ద రక్షణ వంతెనలు నిర్మించలేదని ఓటర్లు ఈ నిర్ణయం తీసు కున్నారు . ఓ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఓటేశారు . కుటుంబ సభ్యులు ఆయనను మంచంపైనే కటిహార్ లోని పోలింగ్ కేంద్రా నికి తీసుకొచ్చారు . ఓ చేతికి సెలైన్ ఉన్నప్పటికీ .. ఓటు హక్కు వినియోగిం చుకున్నారు . ఔరాయ్ నియోజకవర్గంలోని కాత్రా ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం . సీతామర్హిలోని రిగాలోని బూత్ లో ఇవిఎంలో లోపం తలెత్తడం వల్ల కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపో యింది . అలాగే నర్కాటయాగంజ్ , బెతియా కేంద్రాల్లో కూడా ఇవిఎంలలో తలెత్తిన అవాంతరాల వల్ల పోలింగ్ కాస్త ఆలస్యమైంది .

Bihar assembly elections ::

రాష్ట్ర మంత్రి సురేశ్ శర్మ ముజఫర్‌పూర్ లోని 94 వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు . ప్రజలందరూ అభివృద్ధికి ఓటేయాలని కోరారు . ముజఫర్ పుర్ నగరాన్ని సుందరంగా మార్చేందుకు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని అన్నారు . లో తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె , కాంగ్రెస్ నేత సుభాషినీ రాజ్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు . మూడో విడత ఎన్నికల్లో భాగంగా మధేపురా నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లో ఓటేశారు . బీహారీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు . రాజ్యసభ ఎంపి అహ్మద్ అష్ఫాక్ కరీమ్ ఓటేశారు . కటిహార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు . బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 10 న వెల్లడించనున్నారు . దర్బంగాలో ఓటు వేసేందుకు వంతెన నిర్మించుకున్న స్థానికులు దర్భంగా జిల్లాలోని ఓ గ్రామం పక్కగా చిన్న నది ప్రవహిస్తుంటుంది .

అయితే నది ఆవల కూడా కొంతమంది ఆవాసాలు ఏర్పర్చుకుని ఉంటు న్నారు . అయితే ఈ నది మీదుగా వంతెన లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు అనివార్యంగా నిర్బంధంలో ఉండాల్సి వస్తుంది . ఈ విష యమై వారు అధికారులు , పాలకులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టిం చుకున్న నాథుడు లేడు . ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి . ఇటీవల వర్షాలు కురవడంతో నదీ ప్రవాహం పెరిగింది . అక్కడి ప్రజలకు ఓటువేసే అవకాశం లేకుండా పోయింది . దీంతో స్థానికులు తమ సమస్యను మరింత గట్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకు న్నారు . అందుకోసం వారే స్వయంగా తాత్కాలిక వంతెన నిర్మించుకుని , ఆ వంతెన మీదుగా సమీపంలోని పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కు వినియో గించుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button