telugu bigg boss
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చేసింది నీచమైన చర్య!

మొన్నటివరకు తెలుగు ప్రజలను ఆకట్టుకున్న బిగ్ బాస్ షో పై సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ , భారతీయ మహిళా లోకాన్ని కించపరిచేలా బిగ్ బాస్ షో ని నిర్వహించారని మండిపడ్డారు .
నాగార్జున ఒక ఎపిసోడ్ లో ఒక హీరోని స్టేజ్ పైకి పిలిపించి ముగ్గురు హీరోయిన్స్ ఫోటోలను నాగార్జున చూపిస్తూ వీరిలో ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్?, ఎవరితో డేటింగ్ చేస్తావ్?, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? అని ప్రశ్నించాడు. దానికి ఆ హీరో ఒక హీరోయిన్ ను ముద్దు పెట్టుకుంటానని, మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తానని, మరో హీరోయిన్ ను పెళ్లిచేసుకుంటానని సమాధానం ఇచ్చాడు.
ఈ విదంగా బిగ్ బాస్ షో ను కొనసాగించి స్త్రీ జాతిని అవమానించేలా చేసారని, ఈ విషయం పై కోర్టుకి వెళ్తానని , షో నిర్వాహకులు వెంటనే స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలని , లేదంటే హై కోర్టుకైనా వెళ్తానని నారాయణ వెల్లడించారు.