telugu bigg boss

Bigg Boss Telugu 5 Day 16, September 21, Live Updates

bigg-boss-live-Updates
BiggBoss Season 5 Live Updates

Bigg Boss Telugu Day 16 Live Updates : 10:00 PM : – నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తవలేదు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగించి కెప్టెన్సీ కాంటెండర్ టాస్కులతో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ముస్తాబయింది. అప్ డేట్స్ కి మేము రెడీ. చదవడానికి మీరు రెడీ నా ? పేజీ ని రిఫ్రెష్ చేస్తూ చుడండి. ఎంజాయ్ ది బిగ్ బాస్.

10:20PM :- ఈరోజు బిగ్ బాస్ నిన్న రాత్రి ఎపిసోడ్ లో అగయిపోయిన ప్రియా , రవి , లహరి , సన్నీ ఇష్యూ తో మొదలయింది. తర్వాత జెస్సీ వచ్చి వాల్ మీద టైల్ కి నటరాజ్ మాస్టర్ మరియు మానస్ ముద్ర వేసి టైల్ పగలకొట్టి నామినేట్ చేసారు. రీసన్ చాల సిల్లీ గా అనిపించింది. తర్వాత షణ్ముఖ్ వచ్చి టైల్ మీద ప్రియా మరియు లహరి ముద్ర వేసి నామినేట్ చేసారు. సిల్లీ రీసన్స్ ఏ. తర్వాత శ్వేతా వచ్చి శ్రీరామ్ మరియు లోబో ముద్ర వేసి టైల్ పగలకొట్టింది. కరెక్ట్ రీసన్స్ చెప్పింది శ్వేతా.

తర్వాత హమీద వచ్చి ప్రియా మరియు ప్రియాంక ముద్ర వేసి టైల్ పగలకొట్టింది. హమీద ప్రియకి ఇచ్చిన రీసన్స్ కి కంటెస్టెంట్స్ క్లాప్స్ కొట్టారు కానీ ప్రియాంకకి ఇచ్చిన రీసన్ చాల అంటే చాల సిల్లీ. తర్వాత కాజల్ వచ్చి ప్రియాంక ని మరియు ప్రియా ముద్ర వేసి టైల్స్ పగలకొట్టింది. కాజల్ చాల ఓవర్ యాక్షన్ గా మాట్లాడింది.

తర్వాత విశ్వా వచ్చి నటరాజ్ మాస్టర్ మరియు ప్రియా ముద్ర వేసి టైల్స్ పగలకొట్టారు. విశ్వా రీసన్స్ కరెక్ట్ గా చెప్పారు.

ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి లహరి , ప్రియాంక , మానస్ , శ్రీరామ్ మరియు ప్రియా నామినేట్ అయ్యారు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. Vote for Your Favourite Contenstans On 3rd Week.

తర్వాత కాజల్ మరియు సన్నీ సేఫ్ గేమ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ప్రియా ఏడుస్తుంటే మానస్ మరియు ప్రియాంక ఓదార్చారు. ప్రియా కరెక్ట్ చెప్పారు అని చెప్తుంది. నటరాజ్ మాస్టర్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. లహరి మరియు హమీద కలిసి రవి గురించి డిస్కస్ చేస్తున్నారు. ప్రియాంక లోబో మీద నెగటివ్ గా చెప్తూనే హాగ్ ఇచ్చింది. రాత్రి 1:00AM నిమిషాలకు నటరాజ్ మాస్టర్ దగ్గరికి జెస్సీ వచ్చి రీసన్ లేకుండా నామినేట్ చేశా అని చెప్తున్నారు. తర్వాత రవి , శ్రీరామ్ కలిసి డిస్కస్ చేస్తున్నారు.

తర్వాత లహరి ప్రియాంకకి , ప్రియా ఎం చెప్పింది అని అడుగుతుంటే ప్రియాంక చెప్తుంది. ఇపుడు లహరి రవి తో కలిసి ప్రియా చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు. రవి ప్రియా మొత్తం తప్పు గా చెప్పింది అని చెప్తున్నారు. రవి ప్రియా మీద నెగటివ్ గా లహరి చెప్తున్నారు. రాత్రి 3:00AM నిమిషాలకు రవి , లహరి మరియు ప్రియా కలిసి నామినేషన్ లో చెప్పిన మాటల గురించి చర్చిస్తున్నారు. రవి మాట మారుస్తున్నాడు అని చెప్తుంది. తర్వాత లహరి మరియు రవి కలిసి ప్రియా మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు. ప్రియా బయట కూర్చొని ఒంటరిగా ఏడుస్తూంది బ్రేక్.

10:44PM :- బ్రేక్ తర్వాత ఉదయం 9:40 నిమిషాలకు సరైనోడు సినిమా టైటిల్ సాంగ్ వేయగా కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేశారు.

తర్వాత ప్రియా కంటెస్టెంట్స్ అందరి ముందర లహరికి సారీ చెప్పింది. లహరి ప్రియా హాగ్ చేసుకున్నారు. తరువాత ప్రియా బిగ్ బాస్ కెమెరా ముందర నిన్న జరిగిన మ్యాటర్ కూడా చెప్పింది. లహరి ఫామిలీ కి మరియు రవి భార్య కి సారీ చెప్పింది.

మధ్యాహ్నం 1:00PM గంటలకు కెప్టెన్సీ కాంటెండర్ టాస్క్ గా హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి. ఈ టాస్క్ లో హైదరాబాద్ అమ్మాయి కుటుంబ సభ్యులు లహరి అమ్మాయి , యని మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ తల్లిదండ్రులు , రవి మావయ్య , జెస్సి అమ్మాయి తమ్ముడు. అమెరికా అబ్బాయి కుటుంబంగా శ్రీరామ్ పెళ్లి కొడుకు మరియు ప్రియా శ్రీరామ్ కి తల్లి.

షణ్ముఖ్ పెళ్లిళ్ల బ్రోకర్ , లోబో ఈవెంట్ మేనేజర్ , హమీద శ్రీరామ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మిగితా కంటెస్టెంట్స్ అమెరికా అబ్బాయి స్నేహితులు. టాస్క్ మొదలయింది.

అందరు ఎవరు పాత్రలో వారు నటిస్తున్నారు. రవి మరియు నటరాజ్ మాస్టర్ కలిసి కామెడీ బాగా చేస్తున్నారు. సాయంత్రం 4:45 నిమిషాలకు అమ్మాయి కుటుంబం మ్యారేజ్ బ్రోకర్ అయినా షాను దగ్గరికి వచ్చి కామెడీ చేస్తున్నారు. హమీద మరియు సన్నీ కలిసి కామెడీ చేస్తున్నారు. విశ్వా ఈవెంట్ మేనేజర్ అయినా లోబో కి కాల్ చేసి కామెడీ చేస్తున్నారు. లోబో తన అసిస్టెంట్ అయినా శ్వేతా ని పిలిచి హ్యాపీ గ మేటర్ చెప్తున్నారు.

తర్వాత లహరి మరియు మానస్ కలిసి డిస్కస్ చేస్తున్నారు. సాయంత్రం 5:00 నిమిషాలకు అమెరికా అబ్బాయి ఫామిలీ మ్యారేజ్ బ్రోకర్ అయినా షాను ని కలిసి అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. అందరు ఎవరు పాత్రలో వాలు జీవిస్తూ కామెడీ చేస్తున్నారు. ప్రేమ జంట అయినా లహరి మానస్ కలిసి డిస్కస్ చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ మరియు జెస్సీ కలిసి ఫుల్ కామెడీ చేస్తున్నారు. రవి కామెడీ బాగుంది.

మానస్ మ్యారేజ్ బ్రోకర్ అయినా షణ్ముఖ్ తో డీలింగ్ చేస్తున్నారు. పెళ్లి మానస్ తోనే జరగాలని మానస్ ఎంత డబ్బు అయిన ఇస్తా అని ఫిక్స్ చేసారు. మొత్తానికి అమెరికా ఫ్యామిలీ మరియు హైదరాబాద్ ఫామిలీ కలిసి మాట్లాడుకుంటున్నారు బ్రేక్.

10:55PM :- బ్రేక్ తర్వాత సాయంత్రం 6:00 గంటలకు శ్రీరామ్ అమెరికా స్టైల్ లో కోడి బాయి లచ్చమ్మది అని పాట పడ్డారు. తర్వాత అమ్మాయి లహరి అదిగో అల్లదిగో శ్రీ హరి వాసము అనే పాట పాడింది. తర్వాత సన్నీ ప్రియాంక ముందర డబ్బా కొడుతున్నారు. అంటే అమెరికా డబ్బా అన్నమాట. కామెడీ బాగుంది. సన్నీ ప్రియాంక ని ఫ్లర్ట్ చేస్తున్నారు. ప్రియాంక సన్నీ ని హాగ్చేసుకుంది.

హమీద శ్రీరామ్ దగరికి వచ్చి ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని చెప్తుంది. తర్వాత సన్నీ మరియు కాజల్ కలిసి కామెడీ చేస్తున్నారు. లోబో, శ్వేతా వర్మ మరియు షాను కలిసి కమిషన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. కాజల్ మరియు సన్నీ విపరీతంగా కామెడీ చేస్తున్నారు. లోబో డబ్బు కొట్టేసే ప్లాన్ చేస్తున్నారు బ్రేక్.

11:02PM :- బ్రేక్ తర్వాత రాత్రి 8:15 నిమిషాలకు రవి అందరితో మతిమరుపు మావయ్య గా కామెడీ చేస్తున్నారు. షణ్ముఖ్ ఆడపెళ్ళి వారితరుపున నుంచి అగ్రిమెంట్ చేపించుకున్నారు. రవి కామెడీ తో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button