telugu bigg boss

Bigg Boss 5 telugu Monday November 1st Nominations Live Updates : బిగ్ బాస్ సీజన్ 5 నవంబర్ 1 నామినేషన్ ఎపిసోడ్ లైవ్ అప్డేట్స్ :-

bigg-boss-live-Updates
Bigg Boss 5 telugu Monday November 1st Nominations Live Updates

Bigg Boss 5 telugu Monday November 1st Nominations Live Updates : ప్రతి వారం లాగా ఈవారం కూడా నామినేషన్ ప్రక్రియ మొదలయింది. ఎప్పటిలాగే బిగ్ బాస్ వెరైటీ గా ప్లాన్ చేశారు. నామినేషన్ ప్రక్రియ పేరు ‘ క్రీం కొట్టు నామినేషన్ లో వెయ్యు ‘ అంటే హౌస్ లోని సభ్యులందరు వరుసగా నిలబడి ఉండగా ఒక ఇంటి సభ్యుడు క్రీం తీసుకొని నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ మొఖానికి క్రీం కొట్టి సరైన రీజన్ చెప్పాలి.

ముందుగా ఈ ప్రక్రియ మానస్ తో మొదలయింది. మానస్ క్రీం తీసికొని శ్రీరామ్ మరియు జెస్సీ మొఖానికి పూశారు. మానస్ కరెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. తర్వాత సిరి వచ్చి సన్నీ కి మరియు యని మాస్టర్ కి క్రీం మొఖానికి కొట్టి చెత్త రీజన్స్ ఇచింది. తర్వాత శ్రీరామ్ వచ్చి సన్నీ కి మరియు మానస్ కి నామినేట్ చేసి మొఖానికి క్రీం పుసి వరస్ట్ రీజన్స్ ఇచ్చారు. సన్నీ , మానస్ కలిసి శ్రీరామ్ కి కరెక్ట్ గా ఎదురు సమాధానం ఇచ్చారు.

ఇప్పుడు రవి వచ్చి మానస్ కి మరియు కాజల్ ముఖానికి క్రీం పూసి సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తే మానస్ మరియు కాజల్ రవికి సరైన సమాధానం ఇచ్చి రవి నే తప్పు అని ప్రూవ్ చేశారు. తర్వాత జెస్సీ వచ్చి సన్నీ ని మరియు మానస్ ని నామినేట్ చేసి సిల్లీ రీజన్స్ తోనే ముఖానికి క్రీం పూశారు.

ఇప్పుడు ప్రియాంక వచ్చి విశ్వా కి మరియు రవి ముఖానికి క్రీం పూసి స్ట్రాంగ్ అనే సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసింది. తర్వాత సన్నీ వచ్చి సిరి ని మరియు జెస్సీ ని కరెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేసారు. తదుపరి విశ్వా వచ్చి ప్రియాంక ని మరియు మానస్ కి సిల్లీ రీజన్స్ తో నామినేట్ చెయ్యగా మానస్ కరెక్ట్ గ ఎదురు సమాధానం ఇచ్చారు.

తర్వాత కాజల్ వచ్చి రవి ముఖానికి క్రీం పూసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. కాజల్ రెండవ నామినేటెడ్ కంటెస్టెంట్ గా శ్రీరామ్ ముఖానికి క్రీం పూసి నామినేట్ చేసింది. రవి మరియు కాజల్ మధ్య జరిగే సంభాషణ ప్రేక్షకులకి కామెడీ గా అనిపిస్తుంది. వాలు సీరియస్ గా మాట్లాడుకున్న బయట చూసే వారికీ నవ్వొస్తుంది.

ఇప్పుడు యని మాస్టర్ వచ్చి సిరి ముఖానికి క్రీం పూసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. యని మాస్టర్ రెండవ నామినేటెడ్ కంటెస్టెంట్ గా కాజల్ ముఖానికి క్రీం పూసి సిల్లీ రీజన్ ఇచింది.

ఇపుడు షణ్ముఖ్ వచ్చి మానస్ ముఖానికి క్రీం పూసి వరస్ట్ రీజన్ చెప్పి నామినేట్ చెయ్యగా రెండవ నామినేటెడ్ కంటెస్టెంట్ గా ప్రియాంక ముఖానికి క్రీం పూసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసాడు. ప్రియాంక సీరియస్ గా మాట్లాడుతుంది. షణ్ముఖ్ మరియు ప్రియాంక మధ్య హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది.

సిరి మల్లి ముందుకు వచ్చి సన్నీ ని ఎందుకు నామినేట్ చేసిందని రీజన్ చెప్పి కవర్ చేయాలనీ ఏవేవో చెప్తుంది సిరి , సన్నీ కరెక్ట్ గా వివరిస్తున్నాడు. సన్నీ మరియు మానస్ కామెడీ చేస్తున్నారు. వీరి మాటలు విని సిరి సీరియస్ అయింది. మిగితా కంటెస్టెంట్స్ నవ్వుకుంటున్నారు.

మొత్తానికి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు మానస్ , సన్నీ , శ్రీరామ్ , సిరి , కాజల్ , ప్రియాంక , రవి , జెస్సీ , యని మరియు విశ్వా. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ పూర్తయింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button