telugu bigg boss

Telugu Bigg Boss 5 3rd Weekend Live Updates

bigg boss season 5
Bigg Boss 3rd Weekend Live Updates

ఈరోజు బిగ్ బాస్ లో శనివారం కాబట్టి నాగార్జున కంటెస్టెంట్స్ అందరితో సరదాగా గేమ్స్ ఆడించి నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమందిని సేవ్ చేసి వెళ్ళిపోతారు కానీ ఈరోజు ప్రోమో లో నాగ్ చాల సీరియస్ గా కంటెస్టెంట్స్ అందరితో డిస్కషన్ పెట్టబోతున్నారని అర్ధం అయింది. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. లైవ్ అప్ డేట్స్ ఇయడానికి మేము రెడీ. చదవడానికి మీరు రెడీ నా ? అయితే పేజీ ని రిఫ్రెష్ చేస్తూ లైవ్ అప్ డేట్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి.

9:20PM :- ఈరోజు బిగ్ బాస్ లో నాగార్జున గారు జై లవ కుశ సినిమా లోని రావణాసుర పాటతో తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చారు. సోమవారం నుంచి గురువారం వరకు ఎం జరిగిందో చూశారు ఇపుడు శుక్రవారం ఎం జరిగిందో చూద్దాం అని ఆలస్యం చేయకుండా మన టీవీ అన్నారు.

హౌస్ లో 20 వ రోజు ఉదయం 10 గంటలకు రవి , సన్నీ , మానస్ కలిసి నటరాజ్ మాస్టర్ మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు. తర్వాత మానస్ మరియు ప్రియా కలిసి నామినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నారు మరియు రవి తో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. తదుపరి షణ్ముఖ్ మరియు జెస్సీ కలిసి వీక్ ఎండ్ లో నాగార్జున గారు తిడతారేమో అని భయపడుతున్నారు. తర్వాత సిరి మరియు కాజల్ కలిసి షణ్ముఖ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు కాజల్ మరియు షణ్ముఖ్ కలిసి సిరి గురించి మాట్లాడుతున్నారు మరియు లోబో మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు.సాయంత్రం 4:15 నిమిషాలకు లహరి వచ్చి మానస్ తో నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు.

తర్వాత బిగ్ బాస్ మానస్ కి విధించిన జైలు శిక్ష పూర్తవడం తో జెస్సీ వచ్చి లాక్ తీశారు. రాత్రి 7:30 నిమిషాలకు శ్రీరామ్ పాట పాడగా ప్రియాంక డాన్స్ వేస్తుంది. తర్వాత షణ్ముఖ్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు.తర్వాత రోబో మరియు రవి కలిసి కామెడీ చేస్తున్నారు. తర్వాత రాత్రి 10 గంటలకు షణ్ముఖ్ మరియు సిరి కి జెస్సీ ఓదారుస్తున్నారు. ముగ్గురు కలిసి సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. నాగార్జున వీరి డిస్కషన్ చూసి నవ్వుతున్నారు.

నాగార్జున మల్లి మన టీవీ అనగా కంటెస్టెంట్స్ అందరు ముస్తాబయి కూర్చున్నారు. నాగార్జున సైలెంట్ ని కంటెస్టెంట్స్ తట్టుకోలేకపోయారు. నాగార్జున గారు ఉన్న స్టేజి పైన వాల్ అఫ్ టైల్స్ వచ్చాయి. నాగార్జున గారు ముందుగా రవి , ప్రియా టైల్స్ పగలకొట్టి మీ గొడవ ఏంటి అని అడగగా , రవి నామినేషన్ అప్పుడు జరిగిన ఇష్యూ గురించి చెప్తున్నారు. రవి మాట మారుస్తున్నారు. నామినేషన్స్ అప్పుడు రవి చెప్పిన మాటలు రివర్స్ లో చెప్తున్నారు. ఇపుడు ప్రియా కూడా తన వెర్షన్ నామినేషన్ అప్పుడు ఎం చెప్పిందో అదే చెప్పింది. నాగార్జున డీటెయిల్ గా ప్రతిదీ అడుగుతున్నారు. ప్రియా క్లియర్ గా తాను చెప్పాల్సింది చెప్పింది. ఇపుడు లహరి ని నాగ్ పవర్ రూమ్ కి పొమ్మన్నారు బ్రేక్.

9:40PM :- బ్రేక్ తర్వాత లహరి పవర్ రూమ్ లోకి వెళ్ళింది. నాగార్జున వీడియో వేయండి అని బిగ్ బాస్ కి కోరగా బిగ్ బాస్ రవి మరియు ప్రియా మధ్య జరిగిన వీడియో ప్లే చేశారు. వీడియో చూసాక లహరి కి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇపుడు నాగ్ రైట్ అనిపించినా వాలని హాగ్ చెయ్ రాంగ్ అనిపించినా వాలని నిలదియ్యి అని చెప్పగా లహరి బయటికి వచ్చి రవి ని నిలదీసింది. రవికి లహరి చెప్పాల్సిన మాటలని చెప్పేసింది. ప్రియా కి సారీ చేపి హాగ్ ఇచ్చింది లహరి. ఇపుడు రవి నే దోషి అయ్యారని కంటెస్టెంట్స్ అందరి ముందర ప్రూవ్ అయింది. రవి కి క్లియర్ లేదు అని నాగ్ కి చెప్పగా , నాగ్ , రవి ని నిలదీస్తున్నారు. నాగ్ గారు కాజల్ ని ఎవరు తప్పు అని అడగగా అప్పట్లో ప్రియని కానీ ఇపుడు రవి నే అని చెప్పింది.

తర్వాత నాగ్ గారు మానస్ టైల్ పగలకొట్టి వరస్ట్ కంటెస్టెంట్ గా నీకు నువ్వే ఆలా అనేసుకుంటావా అని నిలదీశారు. తర్వాత విశ్వా టైల్ పగలకొట్టి విశ్వా ని ఓదారుస్తున్నారు. కాజల్ వరస్ట్ కెప్టెన్ చెపింది అని విశ్వా కి అడ్వైస్ ఇచ్చారు. హౌస్ లో విశ్వా బెస్ట్ కెప్టెన్ గా అందరు చేతులు ఎత్తారు కాజల్ తప్ప.

తర్వాత నాగ్ షణ్ముఖ్ టైల్ పగలకొట్టి , హౌస్ లో న్యూ కెప్టెన్ షణ్ముఖ్ అని కామెడీ చేస్తున్నారు. జెస్సీ మరియు సిరి ని మానిప్యులేట్ చేస్తున్నావు. నాగ్ షణ్ముఖ్ కి ఫ్రెండ్షిప్ వ్యాలూ చెప్తున్నారు. తర్వాత నాగ్ ప్రియాంక టైల్ పగలకొట్టి ప్రియాంక లవ్ స్టోరీ గురించి చెప్పి మెచ్చుకున్నారు. ప్రియాంక కి సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత నాగ్ గారు బ్రేక్ అన్నారు.

10:00PM :- బ్రేక్ తర్వాత నాగార్జున మన టీవీ అని చెప్పగా ఇపుడు మల్లి కంటెస్టెంట్స్ వచ్చి సోఫా లో కూర్చున్నారు. ఇపుడు నాగ్ గేమ్ డిజైన్ చేసారు దాని పేరు షట్ ది డోర్ ఆన్ ది కంటెస్టెంట్స్ అని చెప్పగా ముందుగా ప్రియా వచ్చి లోబో ని డోర్ వెనకాల నిల్చోబెట్టి ప్రియా డోర్ వేసేసింది. రీసన్ చాల సిల్లీ గా ఉంది. తర్వాత లోబో తీసుకొని వెళ్లి లహరి ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేశారు. రీసన్ లహరి డ్రెస్ స్టైల్ గురించి చెప్తున్నారు.

తర్వాత లహరి రవి ని తీసుకొని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసింది. రీసన్ వీడియో లో చూసిందే చెప్తుంది. ఇపుడు రవి ప్రియా ని తీసుకొని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసి నామినేషన్ లో జరిగిన ఇష్యూ గురించి చెప్తున్నారు. తర్వాత జెస్సీ తీసుకొని లోబో ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేశారు. జెస్సీ చాల సిల్లీ గా రీసన్ చెప్పారు. తర్వాత సిరి వచ్చి సన్నీ ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసింది. రీసన్ గా సన్నీ చెప్పేమాటలు చెప్తుంది.

తర్వాత టైం తో సేవ్ అని చెప్పి నామినేషన్ లో ఉన్న వాలని నిల్చోమనగా, నాగ్ ఎదురుగ ఉన్న గ్లాస్సెస్ లో నీళ్లు వేస్తారు. ఏ గ్లాస్ అయితే గ్రీన్ అవుతుందో వాలు సేఫ్ అనగా , శ్రీరామ్ , మానస్ , ప్రియా , లహరి సేఫ్ కాలేదు. నామినేషన్స్ లో నుంచి సేఫ్ అయినా మొదటి కంటెస్టెంట్ ప్రియాంక బ్రేక్ .

10:22PM :- బ్రేక్ తర్వాత నాగ్ మన టీవీ అనగా టీవీ లో కంటెస్టెంట్స్ వెయిట్ చేస్తున్నారు. గేమ్ కంటిన్యూ చేయగా ఇపుడు శ్వేతా వచ్చి మానస్ ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసింది. వరస్ట్ కంటెస్టెంట్ కాదు అని రీసన్ గా చెప్పింది. తర్వాత నాగ్ షణ్ముఖ్ తో కామెడీ చేస్తున్నారు.

ఇపుడు మానస్ వచ్చి యని మాస్టర్ పైన డోర్ వేశారు. రీసన్ గా నామినేషన్ లో యని మాస్టర్ చెప్పిన పాయింట్ నచ్చలేదు అని చెప్పారు. ఇపుడు యని మాస్టర్ మానస్ ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసింది. రీసన్ గా మానస్ తనకి తాను వరస్ట్ ఎలా అనుకుంటాడు అని చెప్పింది.

తర్వాత ప్రియాంక వచ్చి లోబో ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసింది. లోబో మరియు ప్రియాంక కలిసి కామెడీ చేస్తున్నారు.

తర్వాత విశ్వా వచ్చి లోబో ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసి లోబో వర్క్ మిస్ చేస్తున్నారని రీసన్ గా చెప్పారు. ఇపుడు కాజల్ కూడా వచ్చి లోబో ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసి ఫుడ్ ఇష్యూ గురించి చెప్తుంది. ఇపుడు నటరాజ్ మాస్టర్ వచ్చి కాజల్ ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసి రీసన్ గా కాజల్ ఓవర్ హైపర్ అని చెప్పారు.

నాగార్జున గారు నటరాజ్ మాస్టర్ తో కామెడీ చేస్తున్నారు. ఇపుడు షణ్ముఖ్ వచ్చి సన్నీ ని డోర్ వెనకాల కూర్చోబెట్టి డోర్ వేసి రీసన్ గా సన్నీ వరస్ట్ కంటెస్టెంట్ అని చెప్పారని అది నచ్చలేదు అని చెప్పాడు. ఇపుడు సన్నీ వచ్చి సిరి ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసి సిరి గురించి క్లియర్ గా రీసన్ చేపి క్లారిటీ ఇచ్చారు.

ఇపుడు హమీద వచ్చి కాజల్ ని డోర్ వెనకాల కూర్చోబెట్టి డోర్ వేసి కాజల్ మీద నెగటివ్ గా చెప్తుంది. తర్వాత శ్రీరామ్ వచ్చి జెస్సీ ని డోర్ వెనకాల నిల్చోబెట్టి డోర్ వేసి సిల్లీ రీసన్ వేస్తున్నారు. నాగార్జున గారు శ్రీరామ్ మీద మరియు హమీద మీద కామెడీ చేస్తున్నారు. ఇపుడు టైం తో సేఫ్ సెకండ్ కంటెస్టెంట్ అని చెప్పి బ్రేక్ చెప్పారు.

10:30 PM :- బ్రేక్ తర్వాత నాగార్జున గారు ఉన్న స్టేజి పైన వాల్ అఫ్ లక్ వచ్చింది. అందులో నాగ్ నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ పేర్లు ముద్ర గా వాల్ పైన వేయబోతున్నారు. నాగార్జున గారు సేఫ్ అయినా కంటెస్టెంట్ ముద్ర నే వాల్ పైన వేయబోతున్నారు. ఇపుడు నామినేషన్స్ నుంచి సేఫ్ అయినా రెండవ కంటెస్టెంట్ శ్రీరామ్.

ఇపుడు నామినేషన్స్ లో మిగిలింది మానస్ , లహరి , ప్రియా. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ఎపిసోడ్ కి గుడ్ నైట్ చెప్పారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button