telugu bigg boss

Telugu Bigg Boss 5 2nd Weekend Live Updates

bigg boss season 5
live Updates

Bigg boss 5 Episode 14 Day 13 2nd Weekend Saturday Live Updates: 9:00 PM :- ఈరోజు బిగ్ బాస్ లో నాగార్జున వినయ విధేయ రామ సినిమాలోని ఏక్ బార్ ఏక్ అనే పాటకి స్టైల్ గా స్టెప్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఈవారం చాల ఎక్కువ చేసారు అందరిని సెట్ చేయాలి అని చెప్పారు.

ఈరోజు బిగ్ బాస్ లో నాగార్జున శుక్రవారం ఎం జరిగిందో చూపిస్తున్నారు. శ్వేతా వర్మ మరియు యని మాస్టర్ , లహరి కలిసి సన్నీ మీద కామెడీ చేస్తున్నారు. సన్నీ కి హమీద మీద ఎంత ప్రేమ ఉందొ చెప్తున్నారు. తర్వాత షణ్ముఖ్ మరియు లోబో కలిసి డిస్కస్ చేస్తున్నారు. జెస్సీ సన్నీ గుస గుస లాడుతున్నారు. శ్రీరామ్ మీద వీరు గుస గుసలాడేది. శ్రీరామ్ పైన నెగటివ్ గా మాట్లాడుతున్నారు.


మధ్యాహ్నం 3:40 నిమిషాలకు సన్నీ జైలు శిక్ష ముగిసింది. కెప్టెన్ విశ్వా సన్నీ ని జైలు నుంచి విడుదల చేశారు. కంటెస్టెంట్స్ ఆనందపడుతున్నారు. తర్వాత లోబో మరియు ఉమాదేవి మధ్య కామెడీ సన్నివేశాలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ నవ్వుకుంటూ వచ్చి లోబో ఉమా చేసేది చుస్తున్నారు. తర్వాత రాత్రి 7:30 నిమిషాలకు లోబో మరియు ఉమాదేవి కలిసి ప్రియాంకని ఆడుకుంటున్నారు.


తర్వాత నాగ్ సెట్ చేయాల్సింది చాల ఉంది అని రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రొమోషనల్ వీడియో చూపిస్తున్నారు. రామ్ చరణ్ ని స్టేజి పైకి పిలవగా రచ్చ సినిమా ఇంట్రో సాంగ్ తో చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్ చరణ్ కలిసి కామెడీ చేస్తున్నారు. రామ్ చరణ్ ని పొగిడారు. చరణ్ నాగ్ ని ఎలా ఇంత ఫిట్ గా ఉన్నారని ప్రశ్నలు అడగగా నాగ్ కామెడి గా సమాధానాలు చెప్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ గురించి అడగగా చరణ్ కె ఎం తెలియదు అన్నారు. ఆచార్య షూటింగ్ గురించి మాట్లాడుకున్నారు. సాయి ధరమ్ తేజ్ గురించి కుశల ప్రశ్నలు అడిగారు. హాట్ స్టార్ ప్రోమో మన టీవీ లో వేశారు. నాగ్ మన టీవీ అని చెప్పగా బ్రేక్ .

9:44PM :- బ్రేక్ తర్వాత మన టీవీ లో కంటెస్టెంట్స్ అందరు చాల అందంగా ముస్తాబయి నాగార్జున ని చూడగా చాల ఆనందపడ్డారు. నాగార్జున మాత్రం సీరియస్ గానే ఉన్నారు. నాగ్ కంటెస్టెంట్స్ కి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ ని పిలవగా రామ్ చరణ్ ఎంట్రీ తో కంటెస్టెంట్స్ అందరు చాల అంటే చాల ఆనందపడారు.


చరణ్ నాగ్ కలిసి కంటెస్టెంట్స్ తో ఆడుకుంటున్నారు. చరణ్ యని ని మరియు లోబో ని ఆట పట్టిస్తున్నారు. నాగ్ కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తున్నారు. చరణ్ అందరిని పలకరిస్తున్నారు. చాల కామెడీ గా ఇంట్రో చేస్తున్నారు నాగ్. అందరి ఇంట్రో లు చాల కామెడీ గానే సాగాయి. చరణ్ కంటెస్టెంట్స్ అందరికి అల్ ది బెస్ట్ చెప్పారు.


చరణ్ కంటెస్టెంట్స్ అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. నాగ్ చరణ్ కలిసి మరల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గురించి మాట్లాడుకున్నారు. . చరణ్ నాగ్ కి రిక్వెస్ట్ చేసారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా నితిన్ సినిమా హాట్ స్టార్ లో విడుదల అయింది అని మాస్ట్రో టీం ని స్టేజి పైకి పిలుస్తాను అని చరణ్ రిక్వెస్ట్ చేయగా నాగ్ బిగ్ బాస్ స్టేజ్ చరణ్ కి ఇచేసి వెళ్ళిపోయారు.


చరణ్ మాస్ట్రో టీమ్ నీ స్టేజ్ పైకి పిలిచారు. నితిన్ , తమన్నా , నాభ నటేష్ కలిసి వచ్చి మాస్ట్రో గురించి ప్రొమోషన్స్ చేస్తున్నారు. చరణ్ మరియు మాస్ట్రో బృందం కలిసి బిగ్ బాస్ స్టేజి మీద ప్రొమోషన్స్ చాల బాగా చేస్తున్నారు. మాస్ట్రో సాంగ్ కి నితిన్ , తమన్నా మరియు నాభ నటేష్ రాంచరణ్ కలిసి డాన్స్ వేశారు. తర్వాత మల్లి నాగ్ స్టేజి పైకి వచ్చారు. చరణ్ నాగ్ కలిసి కామెడీ చేసారు. నాగ్ మాస్ట్రో టీం కి విషెస్ చెప్పి అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చారు బ్రేక్.


10:05PM:- బ్రేక్ తర్వాత నాగ్ సీరియస్ మోడ్ ఆన్ అయింది. నాగ్ వెంటనే మన టీవీ అని చెప్పగా కంటెస్టెంట్స్ అందరు మన టీవీ ముందర కూర్చొని నాగ్ కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ సీరియస్ చూసి కంటెస్టెంట్స్ చాల భయపడుతున్నారు.
నాగ్ లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి తేడా గురించి చెప్తున్నారు. బిహేవియర్ బాలేదు అని ముఖం మీదనే చెప్పారు. నాగ్ చెప్పకుండానే బిహేవియర్ బాలేని వాళ్ళు నిలబడండి అనగానే కంటెస్టెంట్స్ తమకంత తామే లేచారు.


ముందుగా ఉమాదేవి తాను బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించింది అని తనకంత తానే ఒప్పుకుంది. నామినేషన్స్ అప్పుడు బ్యాడ్ వర్డ్స్ వాడాను అనింది. క్షమాపణ కోరింది. ఉమా 3 గుంజిళ్ళు తీసి ప్రేక్షకులకు క్షమాపణ చెప్పింది.


తర్వాత లోబో తన బిహేవియర్ ప్రాబ్లెమ్ గురించి చెప్పారు. నామినేషన్స్ లో మానస్ కి తిట్టినందుకు బిహేవియర్ ప్రాబ్లెమ్ అని లోబో నిల్చున్నారని చెప్పారు. నాగ్ లోబో ని క్షమించారు.తర్వాత యని మాస్టర్ టాస్క్ లో ఉమా మీద కోపంగా ఉన్నాను అని చెప్పగా నాగ్ అది తప్పు కాదని యని ని కూర్చొబెట్టారు.


తర్వాత శ్వేతా వర్మ నామినేషన్స్ టైం లో మొఖం మీద గట్టిగ పెయింట్ కొట్టిన విధానం బాలేదని శ్వేతా బిహేవియర్ బాలేదని నిలబడ్డాను అని నాగ్ కి చెప్పగా నాగ్ కి పనిష్మెంట్ కింద శ్వేతా వర్మ ప్రజల ముందర చంప మీద గట్టిగ కొట్టుకుంది శ్వేత వర్మ లోబో కో హమిదా కి క్షమాపణ చెప్పింది.


తర్వాత సన్నీ ని అడగగా సన్నీ తన బాధ చెప్తున్నారు. సన్నీ వరస్ట్ పెరఫార్మెర్ గా నా పేరు అందరు చెప్పేసరికి బాధ వేసింది. అని చెప్పారు. నాగ్ సన్నీ నువ్వు మగాడివా గిగాడివా అని అడిగారు సన్నీ సారీ చెప్పారు. సన్నీ సారీ చెప్పారు. తర్వాత సిరి కి నాగ్ ప్రశ్నలు అడిగారు. నాగ్ సిరి కి నిజంగా సన్నీ ని డ్రెస్ లోపల చెయ్ పెట్టి బెట్టన్ తీసుకున్నాడా అని అడగగా సిరి అవును అనింది. సన్నీ ఆ బెట్టన్ తీసుకోలేదు అని చెప్పాడు. నాగ్ సిరి లోపల నుంచి ఎవరు తీసుకున్నారు అని అందరిని అడిగారు. షణ్ముఖ్ సన్నీ చెయ్ పెట్టి తీసాడు అని చెప్పాడు. సన్నీ నేను చేయలేదు ఆలా నాగ్ కి జరిగింది చెప్తున్నారు. నాగార్జున వీడియో ప్లీజ్ అని చెప్పగా ఆరోజు జరిగిన వీడియో చూపించారు. వీడియో చూసి విశ్వా సమాధానం చెప్పాలి అన్నారు బ్రేక్.


10:20PM :- బ్రేక్ తర్వాత వీడియో ప్లే అయింది.విశ్వ సన్నీ చెయ్ అయితే లేదు అని క్లారిటీ ఇచ్చారు. నాగ్ సిరి ని తిడుతున్నారు. సన్నీ క్యారెక్టర్ ని చెడకొట్టాదు అని సిరి కి నాగ్ వార్నింగ్ ఇచ్చారు. సిరి సన్నీ కి హాగ్ ఇచ్చి సారీ చెప్పింది. సన్నీ నాగ్ కి థ్యాంక్స్ చెప్పారు. షన్ను కూడా సన్నీ కి సారీ చెప్పారు. తర్వాత శ్రీరామ్ ని ఎందుకు నిలుచున్నా అంటే టాస్క్ టైం లో డాన్స్ మరియు పాట పాడినందుకు ఏమైనా నెగటివ్ వే లో వెళ్ళింది అని నాగ్ కి చెప్పగా నాగ్ ఆలా ఎం లేదు యువర్ గుడ్ అని చెప్పారు. మానస్ కి సంచలక్ ఎలా ఉండాలో చెప్పారు.

తర్వాత నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని లేవండి అనగా అందరు నిల్చున్నారు. విశ్వా స్టోర్ రూమ్ నుంచి బ్యటన్ తీసుకొని వచ్చి నామినేషన్ లో ఉన్న వారికీ ఇచ్చారు. బ్యటన్ ఓపెన్ చేయాలి రెడ్ ఉంటె సేఫ్ కాదు. యని మాస్టర్ మరియు లోబో కలిసి ఒకేసారి సేఫ్ అయ్యారు. మిగితా నామినేషన్ లో ఉన్న ఎవరు సేఫ్ అనేది నాగ్ బ్రేక్ తర్వాత చెప్తా అన్నారు బ్రేక్.

10:30PM :- బ్రేక్ తర్వాత నాగార్జున స్టేజి పైకి వచ్చి ఈరోజు మొత్తం ముగ్గురు సేఫ్ అవుతారు అందులో ఇదివరకే లోబో , యని మాస్టర్ సేఫ్ అయ్యారు. మూడో సేఫ్ కంటెస్టెంట్ ఎవరు అనేది నాగ్ పక్కన ఉన్న కత్తి చెప్తుంది అన్నారు. నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ భయం భయం గా కత్తి వైపు చూస్తున్నారు. సేఫ్ అయినా మూడో కంటెస్టెంట్ ప్రియాంక. ఇపుడు నామినేషన్స్ లో ఇంకా నాలుగురు ఉన్నారు. నాగ్ అందరికి గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు.

ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button