Bigg Boss 4 telugu : బిగ్ బాస్ 4కు అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా !

Bigg Boss 4 Winner Abhijeet : మొన్ననే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఎట్టకేలకు చాల గ్రాండ్ గా పూర్తిచేసుకుంది. లాస్ట్ వరకు ఎంతో ఉత్కంఠభరితంగా కోనసాగింది. ఈ షోలో అభిజిత్-అఖిల్-సోహైల్ మధ్య గట్టిపోటీ జరిగింది. మొత్తానికి డిసెంబర్ 20న జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిజిత్ టైటిల్ సాధించాడు. అలాగే అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.
ఇదంతా పక్కనపెడితే .. ఈ షోకు హోస్టుగా వ్యవహరించిన హీరో నాగార్జున రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ కి గురికావాల్సిందే . ఇపుడు ఈ విషయం గురించే అంత మాట్లాడుకుంటున్నారు.
బిగ్ బాస్ షో నిర్వాహకులు నాగార్జునతో 30 ఎపిసోడ్లకు ఒప్పందం చేసుకున్నారు . అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ ఉండడంతో నాగ్ రెండు ఎపిసోడ్లు చేయలేక తన కోడలు సమంతతో అడ్జెస్ట్ చేసారు . అయితే దానికి సంబంధం లేకుండా షో నిర్వాహకులు రూ. 7 కోట్లు నాగ్ కి ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినబడుతుంది. ఈ విషయంపై ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.