బిగ్ బాస్ షో కి నాగార్జున దూరం కానున్నాడా !

Bigg Boss 4 telugu హీరో నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ప్రారంభం మళ్ళీ మొదలవుతుండడంతో నాగ్ థాయిలాండ్ వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ షూటింగ్ వల్ల నాగ్ థాయిలాండ్ వెళ్తే బిగ్ బాస్ షో కి నాలుగు వారాలపాటు హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే విషయం చాల సస్పెన్సు గా ఉంది.
బిగ్ బాస్ టీమ్ ముందుగా ఈ నాలుగు వారాలు హోస్ట్ గా చేయమని జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచారట, కానీ ఎన్టీఆర్ RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో తనకి కుదరదని చెప్పాడట.
కానీ హోస్ట్ ని నాలుగు వారాలు మార్చితే TRP రేటింగ్ కూడా తగ్గిపోతుంది కావచ్చు అని బిగ్ బాస్ టీమ్ ఆందోళనకు గురి అవుతున్నట్టు తెలుస్తుంది.
దీనికి సంబంధించి బిగ్ బాస్ టీమ్, నాగార్జునని ఒక సొల్యూషన్ ఇవ్వమనడంతో తానే ఈ నాలుగు వారలు వీకెండ్ లో వచ్చి హోస్ట్ గా తన బాధ్యత నిర్వహిస్తానని చెప్పడంతో బిగ్ బాస్ 4 టీమ్ సంతోషం వ్యక్తపరిచారని వార్తలు వినబడుతున్నాయి.
ఈ విషయం పై అఫీషియల్ గా అనౌన్సమెంట్ రావలసి ఉంది.