Gangavva emotional in big boss 4

bigg boss 4 బండలను కూడా పిండి చేయగలను కానీ ఇక్కడ ఉండలేక పోతున్నా అని ,గంగవ్వ బిగ్ బాస్ కి తన మోర వినిపించింది.
అంతేకాకుండా మట్టిలో పుట్టి ,మట్టిలో పెరిగినదాన్ని,ఈ నాలుగు గోడల మధ్య నిద్ర పట్టడంలేదు సారూ నీకు దండం పెడతా నన్ను ఇంటికి పంపించండి తన బాదని బిగ్ బాస్ కి వినిపించింది .
ఇలా రెండు వారాలకే గంగవ్వ తన ఊరూ పై బెంగ పెట్టుకోవడంతో గంగవ్వ అభిమానులు కాస్త భావోద్వేగాలకు గురి అయ్యారు.

బిగ్ బాస్ గంగవ్వకి ఇలా దైర్యం చెప్పాడు. అమ్మ మీరు చాల తెలివైనవారు,మీది చాల గట్టి గుండె ,మీరు ఎన్నో కష్టాలు పడ్డ అనుభవం వుంది ,మీరు ఈ బిగ్ బాస్ లో తట్టుకోగలరు,మీ ఆరోగ్యం చూసుకోవడానికి బిగ్ బాస్ లో డాక్టర్స్ ఉన్నారు,మీరు ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా దైర్యంగా ఉండండి అని బిగ్ బాస్ సమాధానం ఇచ్చారు.
బిగ్ బాస్ మాటలకూ గంగవ్వ కొంత దైర్యం తెచ్చుకొని ,బిగ్ బాస్ రూమ్ లో నుండి బయటికి వచ్చి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది.