telugu cinema reviews in telugu language

Bharateeyans Movie Review : భారతీయన్స్ సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Bharateeyans Movie Review : భారతీయన్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ దీనరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్ ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ సినిమా దేశభక్తికి సంబంధించిందని.. అయితే ఇప్పటికే లెక్కలేనని దేశభక్తి కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డైరెక్టర్ మొదట రచయిత…భారతీయన్స్ మూవీ తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమాల్లోని పలు పాత్రలో రాజేశ్వరి చక్రవర్తి, సోనమ్ టెండప్, సుభారంజన్, మహేందర్ బర్కాస్, నీరోజ్ పుచ్చా తదితరులు నటించారు. ఈ చిత్రానికి శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.

ఇక సినిమా స్టోరీలోకి వెళ్తే.. ఇండియాలోని ఆరు ప్రాంతాల్లోని ఆరుగురు వ్యక్తుల చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఆ ఆరుగురు వ్యక్తుల్లో ముగ్గురు మగవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు. ఆరుగురిలో ఒకరు తెలుగు, మరొకరు పంజాబీ, బెంగాలీ, నేపాలి, భోజ్ పురి,త్రిపురకు చెందినవారు ఉంటారు. అయితే వీరు వివిధ రాష్ట్రాలకు ప్రాంతాలకు చెందిన వారైనా ఆ ఆరుగురికి దేశభక్తి ఎక్కువ. అయితే ఆ ఆరుగురికి కొందరు ఫోన్ చేసి ఒక సీక్రెట్ మిషన్ ఉందని.. బార్డర్ దాటి చైనా లోకి వెళ్లాలని చెప్తారు. అయితే ఆ ఫోన్ చేసిన ఆజ్ఞాత వ్యక్తులు ఎవరు? అసలు సీక్రెట్ మిషన్ ఏంటి? ఆ ఆరుగురు సీక్రెట్ మిషిన్ ని సక్సెస్ చేస్తారా లేదా? అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ..!రేటింగ్:- 3.25

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button