Tollywood news in telugu

Bhama Kalapam Movie Review :-

Bhama Kalapam Movie Review

Movie :- Bhama Kalapam (2022) Review

నటీనటులు :- ప్రియమణి , శాంతి రావు , జాన్ విజయ్ , శరణ్య ప్రదీప్ మొదలగు

సంగీత దర్శకుడు :- మార్క్ కే రాబిన్ , జస్టిన్ ప్రభాకరణ్

నిర్మాతలు :- సుధీర్ ఈదర

దర్శకుడు: – అభిమన్యు తడిమేటి

Story ( Spoiler Free):-

ఈ కథ అనుపమ ( ప్రియమణి ) చుట్టూ తిరుగుతుంది. అనుపమ హౌస్ వైఫ్ మరియు తన చుట్టూ పరిసరాల మీద కూడా ఎప్పుడూ ఒక్క కన్ను వేసే ఉంటుంది. అలాంటి అనుపమ కి అనుకోకుండా ఒక గుడ్డు లో ఏదో తెలియని విషయాని గ్రహిస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఆ గుడ్డులోని ఉన్న వస్తువు విలువ 200 కోట్లు. ఇదిలా ఉండగా కొని అనుకొని కారణాల చేత అనుపమ మర్డర్ కేసులో చిక్కుకుంటుంది.

ఇప్పుడు అనుపమ ఎం చేయబోతుంది ? ఎలా అనుపమ మర్డర్ కేసులో చిక్కుకుంది ? ఇంతకీ ఆ 200 కోట్ల విలువ చేసే గుడ్డు అనుపమకు ఎలా దొరికింది ? ఆ గుడ్డు ఎవరిది ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

Positives 👍 :-

  • ప్రియమణి ఎప్పటిలాగే పాత్రలో ఒదిగిపోయి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన పాత్రధారులు కూడా వారివారి పాత్ర పరిధిలో బాగా చేశారు.
  • దర్శకుడు అభిమన్యు సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
  • థ్రిల్లింగ్ సన్నివేశాలు చాల బాగున్నాయి.
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
  • నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
  • సినిమాటోగ్రఫీ చాల బాగుంది.

Negatives 👎 :-

  • కొన్ని లాజిక్స్ మిస్స్ అయ్యాయి.

Overall:-

మొత్తానికి భామ కలాపం అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా డార్క్ కామెడీ మరియు థ్రిల్లర్ సినిమా లవర్స్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే ప్రియమణి తన మార్క్ నటనతో ప్రేక్షకులని అలరిస్తుంది. దర్శకుడు అభిమన్యు కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు.

థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .

Rating :- 3 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button