Tollywood news in telugu

మనుషుల్లారా జాగ్రత్త అంటున్న “డార్క్ సూపర్ హీరో”

దర్శకుడు శంకర్ మరియు ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ రోబో. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మూవీ 2.0. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం అభిమానులకు, ప్రేక్షకులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. 2.0 సినిమాలో అక్షయ్ కుమార్ తాను నటిస్తున్న ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. “నా అభిమానులకు నేనిచ్చే బర్త్ డే పార్టీ ఇదే. నేను నటిస్తున్న ఓ శక్తివంతమైన పాత్రను మీతో పంచుకుంటున్నాను. మాటలే రాని ఓ ప్రపంచానికి నేనో డార్క్ సూపర్ హీరోని. మనుషుల్లారా జాగ్రత్తా అంటూ అక్షయ్ కుమార్ ట్విట్ చేశాడు.” కాగా ఈ పోస్టర్ లో ఈ ప్రపంచం మనుషుల ఒక్కరి కోసం మాత్రమే కాదు. అని పోస్టర్ పై ఉన్నది. ఈ సినిమాలో అక్షయ్ కాకిని పోలిన గెటప్ లో కనిపిస్తున్నారు.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

ఈ 2.0 మూవీ ఇప్పుడు బాహుబలి రికార్డును బ్రేక్ చేసిందని ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ రికార్డు దేని గురించి అనుకుంటున్నారా? బడ్జెట్ విషయంలోనండి. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో  గంటన్నర సమయం ఉన్న ఈ చిత్రానికి 525 కోట్లకి పైగా ఖర్చు అయిందని ఆ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. గ్రాఫిక్స్ వర్క్ కే బడ్జెట్ ఎక్కువైందని టాక్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అమిజాక్సన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రపంచంలోని 3000 మంది నిపుణులు ఈచిత్రం కోసం పనిచేస్తున్నారట. భారీ అంచనాలతో రాబోతున్న 2.0 తెలుగు ,తమిళ , హిందీ భాషల్లో నవంబర్ 29న విడుదలకానుంది. ప్రస్తుతం అందరి కళ్ళు ఈ సినిమా టీజర్ పైనే వున్నాయి. వినాయక చవితి రోజు సెప్టెంబర్ 13న ఈసినిమా టీజర్ 3డి &2డి ల్లో విడుదలకానుంది. ఇక ఈ టీజర్ ను ప్రదర్శించడానికి తమిళనాడులోని థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. ఎప్పుడో విడుదలకావల్సిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అయ్యింది. భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా 2.0 రికార్డుకెక్కింది. మరి విడుదల తర్వాత కలెక్షన్స్ పరంగా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

 

 

 

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button