వేసవిలో వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..
వేసవి కాలంలో మనం ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ కాలం శరీరాన్ని చల్లబరిచే సహజసిద్ధ పండ్లు చాలానే దొరుకుతాయి. వాటిలో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. వేసవిలో వీటిని తినడం వల్ల కలిగే మేలు అంతాఇంతా కాదు.
తాటి ముంజలు మనకు వేసవిలో దాహాన్ని తీర్చి, శరీరాన్ని చల్లబరుస్తాయి.
తాటిముంజలలో విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం వంటివి అధికంగా ఉంటాయి.
వేసవిలో చిన్న పిల్లలతో పాటు పెద్దవారు వడదెబ్బకు గురవుతుంటారు. వీటిని తినడం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంది.

తాటి ముంజలలోని నీరు చలువ చేస్తుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
తాటి ముంజలో నీటిశాతం అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
తాటిముంజలలో అధికశాతం పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
ఎండాకాలంలో చాలా మంది మలబద్దకంతో బాధపడుతుంటారు. అలాంటి వారు తాటిముంజలు తింటే మంచి ఫలితం ఉంటుంది.