health tips in telugu
మెదడును చురుగ్గా ఉంచే ఆహార పదార్థాలివే..
సాధారణంగా ఏ వ్యక్తయినా తన ప్రతిభను చాటుకోవాలంటే శారీరకంగానూ, మానసికంగానూ ధృడంగా ఉండాలి. అలా ఉండాలంటే మొదట మనం మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచే ఆహార పదార్థాలేవో తెలుసుకుందాం..
రోజూ గుప్పెడు వాల్‌నట్స్ తినడం వల్ల జ్ఞాపకవక్తిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

ఓట్స్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. మెదడుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఒక కప్పు ఓట్స్, పండ్లు తీసుకోవడం వల్ల మెమెరీ పవర్ పెరగడంతో పాటు, ఏకాగ్రతను పెంపొందిస్తుంది.
అరటి పళ్లలో మెదడు పెరుగుదల, బ్రెయిన్ ఫంక్షన్స్‌కు అవసరమయ్యే మాంగనీస్ పుష్కలంగా ఉండటం వల్ల అరటి పండ్లను తరచూ తింటూ ఉండాలి.
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచడంలో బాగా సహాయపడతాయి.