Fitness: ఈ డైట్ పాటించండి.. ఫిట్‌గా ఉండండి
మన శరీరం ఫిట్‌గా ఉంటేనే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దీని కోసం సరైన పోషకాహారం, మంచి జీవనశైలి ఎంతో ముఖ్యం. వీటితోపాటుగా వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన శరీరం ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం.
ఉదయం పూట అరటిపండు అల్పాహారంగా మంచిది. బీపీ ఉన్నవాళ్లు పోటాషియం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజుకొక ఆపిల్ లేదా అరటిపండు తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి.

అనారోగ్యకరమైన ఆహారం తినడం, ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల మనిషి బరువును అసహజంగా పెంచడంతోపాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.
పోషకవిలువలు లేని ఆహారం తినడం, అర్ధరాత్రి వరకు ఏదో ఒక చిరుతిండి తింటూ ఉండటం వల్ల ప్రధానంగా రక్తహీనత ఏర్పడుతుంది.
అధిక బరువు ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఎక్కువ బరువు ఉండే వాళ్లు 13 రకాల క్యాన్సర్లకు గురవుతున్నట్లు ఈ మధ్య పరిశోధనల్లో తేలింది.
పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు మన ఆహారంలో నిత్యం ఉండేలా చూసుకోవాలి.
ప్రతి ఒక్కరూ తాము ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటామో గుర్తుంచుకోవాలి. కానీ మోతాదును నిర్ణయించుకుని కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది మన చేతుల్లో ఉన్నపని అని గుర్తుంచుకోవాలి.