Best fitness tracker 2020 in telugu
Best fitness tracker 2020 in telugu
ఈ రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా ఫిట్నెస్ పై శ్రద్ధ చూపిస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన విదేశీ సంస్థలు ముందుగా ‘fitbit’ అంటూ మన ముందుకు వచ్చాయి. ‘fitbit’ రాకతో ఒక కొత్త ఫిట్నెస్ ప్రపంచానికి నాంది పలినట్ట అయింది. ఆ పైన ఒక దాని తరువాత మరొక రకం వేరబుల్స్ మార్కెట్ ను ముంచెత్తాయి. విదేశీ సంస్థలకు మేమేమీ తక్కువ కామంటూ దేశీ సంస్థలు కూడా ఈ ఫిట్నెస్ మార్కెట్లోకి అడుగు పెట్టాయి. తాజాగా ఈ కామర్స్ సంస్థ myntra కూడా Myntra Blink Go అనే ఫిట్నెస్ ట్రాకర్ ను ప్రవేశ పెట్టింది.
ఈ వేరబుల్ బ్యాండ్ లో కలర్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో హార్ట్ రేట్, స్టెప్ కౌంటర్, కెలొరీ కౌంట్, పెడోమీటర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ సాధారణంగా ‘fitbit’ మొదలుకుని ఏ వేరబుల్ బ్యాండ్ లోనైనా ఉండేవే కానీ myntra వీటన్నిటినీ అత్యంత తక్కువ ధరకు అందించడం Blink Go ప్రత్యేకత. అంతేనా, మరి కొద్ది కాలంలో Myntra స్మార్ట్ షూ మొదలుకుని పలు రకాల పరికరాలను విడుదల చేయనుంది. ఈ Myntra Wearable Platform (MWP) నుండి విడుదల అయ్యే అన్ని పరికరాలు ఒకదానికొకటి అనుసంధానం చేయబడి పని చేస్తాయి. తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన fitness అందించవచ్చని Myntra ఆలోచన. ఇంతకీ ఈ Blink Go ప్రారంభ ఆఫర్ కింద కేవలం 1690 కే లభిస్తుంది. ప్రస్తుతం ఇది అమెజాన్ మొదలైన ఈ కామర్స్ సైట్లలో 4999 కు లభిస్తోంది.
Myntra మాత్రమే కాదు మరెన్నో దేశీ fitness సంస్థలు ఈ వేరబుల్ మార్కెట్లోకి దిగుతున్నాయి. వాటిలో కొన్ని ఢిల్లీ కి చెందిన Boltt, GoQii Life మొదలైనవి ఉన్నాయి.