health tips in telugu

Best 5 energy foods- తక్కువ ఖర్చు తో నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే 5 ఆహారాలు!

Best 5 energy foods : తక్కువ ఖర్చు తో లభించే ఎక్కువ పౌష్టికాహారం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఈరోజు మనము పేదవారికి అతితక్కువ ఖర్చుతో ఎంతో ఆరోగ్యాని సమకూర్చే అరుదైన 5 చిట్కాలు చెప్పబోతున్నాము. సాధారణంగా బలమైన ఆహారాలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బాదం పప్పు , పిస్తా పప్పు , జీడి పప్పు , వాల్ నట్స్ , ఇలా అనుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ డబ్బు ఉన్నవారు , ఎక్కువ ఖర్చు చేసేవారు ఇవి కొనగలరు. కానీ తక్కువ ఖర్చుతో బలమైన ఆరోగ్యం పొందడం ఎలా అనేదే ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మేము చెప్పబోయేది పేదలకు  మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య లాభం పొందాలని అనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఇంకెందుకు ఆలస్యం వెంటనే మ్యాటర్ లోకి వెళ్దాం.

* వేరుసెనగ పప్పు / గ్రౌండ్ నట్స్ / పల్లీలు :-

100 గ్రాముల వేరుసెనగ పప్పు లో మనకు 517 క్యాలరీలు వస్తాయి. ఈ 100 గ్రామాలు వేరుసెనగ పప్పు యొక్క ధర 12 రూపాయిలు. ఇది 100 గ్రాముల మేక మాంసం కన్న , 100 గ్రాముల జీడి పప్పు కన్న అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ శాతం బలాన్ని ఇస్తుంది. 100 గ్రాముల మేక మాంసం లో మనకు లభించేది కేవలం 110 క్యాలరీలు దీని అయ్యే ఖర్చు 60 రూపాయిలు. మీరే తేడా గమనించ వచ్చు. 12 రూపాయిలతో 515 క్యాలరీలు తెచ్చుకోవడం మేల లేదా 60 రూపాయిలు ఖర్చు చేసి 110 క్యాలరీలు వచ్చే మేక మాంసం తీసుకోవడం మేల అని.

రోజూ వేరుసెనగ పప్పు తీసుకోవడంతో ఎంతో బలాన్ని ఇస్తుంది. దీని అందరూ తీసుకోవచ్చు. జిమ్ చేసే వారైనా , హార్డ్ వర్క్ చేసే వారైనా, ఎలాంటి పని చేసే వారైనా ఈ వేరుసెనగ పప్పు తినడం తో ఎంతో లాభం పొందుతారు.

ఈ వేరుసెనగ పప్పు నీ 8 గంటల పాటు నీళ్ళలో నానబెట్టినా తర్వాత తీసుకోవడం ఎంత శ్రేష్ఠమైనది. పొలాలలో నుంచి నేరుగా తెచ్చుకుంటే నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ వేరుసెనగ పప్పు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. వేరుసెనగ పప్పు తో పాటు బెల్లం లేదా ఖర్జూరం తింటే చాలా మంచిది.

* పచ్చి కొబ్బరి :-

ఒక్క 100 గ్రాముల పచ్చి కొబ్బరి తినడం 400 గ్రాముల చికెన్ తినడం తో సమానం. ఒక్క టెంకాయ ఖరీదు 20 రూపాయిలు ఆ 20 రూపాయిలతో తెచ్చుకున్న పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోని తినడం వలన మనకు ఎంతగానో ఆరోగ్యాని ఇస్తుంది. ఇలా తరచూ తినడం వల్ల బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మతిమరుపు తగ్గిస్తుంది. 150 రూపాయిలు పెట్టీ వారంలో ఒక్కసారి చికెన్ తినడం కన్న రోజు 20 రూపాయిలు పెట్టీ పచ్చి కొబ్బరి తినడం ఎంతో శ్రేష్ఠం. దానికి తోడు పచ్చి కొబ్బరి లో మనకు జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది.

* తెల్ల నువ్వులు :-

547 క్యాలరీలు ల క్యాల్షియం ఒక్క 100 గ్రాముల తెల్ల నువ్వులు లోనే దొరుకుతుంది. మనము ఎలాగో పాల ప్యాకెట్లు కొంటాము. 50-70 రూపాయిలు పాల ప్యాకెట్ కొనడం కన్న 100 గ్రాముల తెల్ల నువ్వులు లో ఎండు ఖర్జూరాలు (గింజలు ) తీసేసి మిక్సీలో వేసి లడ్డు లాగా చేసుకోండి రోజు ఒక్క లడ్డు ఆహారం తర్వాత తింటే ఇంకా పాల ప్యాకెట్లు కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. తెల్ల నువ్వులు లో దొరికినంతా క్యాల్షియం మరెక్కడా దొరకదు.

* వాటర్ మిలన్ సీడ్స్ / పుచ్చకాయ గింజలు :-  చికెన్ కంటే మేక మాంసం కన్న ఎక్కువ ప్రోటీన్ ఎందులోనైన ఉందంటే అది పుచ్చకాయ గింజలు. ఈ గింజలను నానబెట్టి పప్పు చేసుకుంటే ఎక్కువ ప్రోటీన్స్ మీకు లభిస్తుంది.

* సోయా బీన్స్ :-

సోయా బీన్స్ కూడా అధిక శాతం ప్రోటీన్స్ ఉన్న పదార్థం. దాదాపు 43 శాతం ప్రోటీన్స్ మీకు ఈ సోయా బీన్స్ లో లభిస్తుంది. మీరు రోజూ 12 గంటలు సోయా బీన్స్ నీళ్ళలో నానబెట్టి మీరు వండుకునే ఎటువంటి ఆహారంలో నైన ఈ సోయా బీన్స్ వేసుకొని వాడుకోవచ్చు.

ఇలా ఈ 5 పదార్ధాలు తీసుకోవడం వల్ల మీకు డబ్బు ఆదాయం అవుతుంది మరియు అధికంగా ఎక్కువ అయువారోగ్యలను సమకూరుస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button