Chaddannam: ఉదయాన్నే చద్దన్నం తింటే ఎన్ని లాభాలో..
మన తాతలు, తండ్రులు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయాన్నే తిని శుభ్రంగా వారి పనులు వారు చేసుకునేవారు. అయితే మనం అలా చేస్తున్నామా అంటే మాత్రం ఊహూ అనే చెప్తాం. అయితే రాత్రిపూట వండిన ఆహారం ఉదయాన్నే బ్రేక్‌పాస్ట్‌గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ఇనుము, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి6, బి12 పుష్కలంగా లభిస్తాయి.
చద్దన్నం కడుపును చల్లగా ఉంచి, రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కడుపులో మంట అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేసి కడుపును ఆరోగ్యంతో ఉంచుతుంది.
చద్దన్నంలో శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.
వేడి అన్నంతో పోలిస్తే చద్దన్నంలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి బ్రేక్‌పాస్ట్.