Bellamkonda Suresh: దిల్ రాజు ను కిల్ రాజు అంటావా ?

నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి కి దిల్ రాజు, శిరీష్ రెడ్డి ల గురించి మాట్లాడే అర్హత లేదని నిర్మాత బెల్లంకొండ సురేష్ మండిపడ్డారు.ఈ మేరకు అల్లుడు అదుర్స్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిల్ రాజుని కిల్ రాజు అని అంటావా? అన్ని డిస్ట్రిబ్యూటర్ శీను పై మండిపడ్డారు. “ఆది” సినిమా నుంచి “అల్లుడు అదుర్స్” చిత్రం వరకు వాళ్లతో నాకు 20 ఏళ్లగా జర్నీ కొనసాగుతుందని, వాళ్లు నైజాం ఇండస్ట్రీలో లేకుంటే ప్రొడ్యూసర్లుగా ఎవరూ ఉండేవారు కాదని అన్నారు.

ఆ శ్రీను తను ఆరు సంవత్సరాల్లో ఆరు సినిమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని… మరి ఈ దిల్ రాజు, శిరీష్ రెడ్డిలు వందల సినిమాలు చేసి… ఎంతోమందికి లైఫ్ ఇచ్చారన్నారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు తెచ్చి ఏపీ తెలంగాణలో జనాలని థియేటర్ లోకి రప్పించడానికి వాళ్ళు చాలా కృషి చేశారన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ అర్థం లేని ఆరోపణలు చేస్తూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. డిస్ట్రిబ్యూటర్ శ్రీను చిత్రాలకు రెండేళ్లుగా జిఎస్టి కట్టలేదని.. ఇంకా అలాంటి వారిని ఓయూ జేఏసీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీ నాయకులు వేరే వాళ్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని బెల్లంకొండ సురేష్ మండిపడ్డారు.

దిల్ రాజుకి ఇంగ్లీష్ ,తమిళ్ రాదు, అని విమర్శిస్తున్నారని… అయినా అవేవీ రాకున్న మంచి మంచి సినిమాలు చేస్తున్నారన్నారు. డిస్ట్రిబ్యూటర్ శీను తనకు దిల్రాజు, శిరీష్ రెడ్డిలు సినిమాలు రాకుండా చేస్తున్నారని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ సంపత్ నాయక్ తో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే