Today Telugu News Updates
ప్రారంభం కానీ సినిమా థియేటర్లు … కారణాలు ఇవేనట !

కోవిడ్ వల్ల ఇన్ని నెలల పాటు థియేటర్లు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు ఓపెన్ చేసుకొమ్మని తెలిపింది. దీంతో కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ కూడా వెల్లడించాయి. సినిమా అభిమానులు కూడా సంతోషపడ్డారు. కానీ ఇప్పటివరకు థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీనికిగల కారణం థియేటర్ ఓనర్స్ , ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరిగిన ఒప్పందాలు కుదరకపోవడమే అని తెలుస్తుంది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే గిల్డ్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన సమావేశాల్లో పలు అంశాలు చర్చకు రాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరియు ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సినిమా ఆడకూడదని నిర్ణయించుకున్నారు.
దీని వల్ల సినీ అభిమానులు నిరాశకు లోనయ్యారు.